Breaking News

మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?: మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

Published on Fri, 07/25/2025 - 11:39

టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)పై భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. గాయపడినా జట్టు ప్రయోజనాల కోసం అతడు పోరాడిన తీరు అమోఘమని కొనియాడాడు. అయినా.. మరణాన్నే జయించిన వాడు ఇలాంటి చిన్న చిన్న ఎదురుదెబ్బలకు తలవంచడంటూ ఆకాశానికెత్తాడు.

చావోరేవో
టెండుల్కర్‌- ఆండర్సర్‌ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ (Ind vs Eng) మధ్య బుధవారం నాలుగో టెస్టు మొదలైంది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు ఆటలో భాగంగా నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.

రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగి
అయితే, మొదటి రోజు 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా పంత్‌.. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని అంచనా వేయడంలో పొరపడగా.. అది పంత్‌ కుడికాలి పాదాన్ని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. స్కానింగ్‌లో అతడి బొటనవేలు ఫ్యాక్చర్‌ అయిందనే వార్తలు వచ్చాయి.

హాఫ్‌ సెంచరీతో మెరిసి
ఈ నేపథ్యంలో పంత్‌ మళ్లీ తిరిగి బ్యాటింగ్‌కు రాడనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతడు రెండో రోజు మైదానంలో దిగాడు. కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. అర్ధ శతకం (54) బాది పెవిలియన్‌ చేరాడు. తన పాత స్కోరుకు మరో పదిహేడు పరుగులు జత చేసి వెనుదిరిగాడు.

తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పంత్‌ పోరాటపటిమ, ఆట పట్ల అతడి అంకితభావం గురించి కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అనిల్‌ భాయ్‌ను గుర్తు చేశాడు
‘‘రిషభ్‌ పంత్‌ పట్టుదల గురించి తప్పక మాట్లాడాలి. అతడు నాకు అనిల్‌ (కుంబ్లే) భాయ్‌ను గుర్తు చేశాడు. ఆంటిగ్వాలో తన దవడ విరిగినా బౌలింగ్‌ చేసేందుకు వచ్చాడు. అప్పుడు అది అవసరం లేదు. కానీ ఆయన ఆ వికెట్‌ తీసి మరీ సత్తా చాటాడు.

ఇక ఇప్పుడు రిషభ్‌ పంత్‌.. కనీసం నడవలేకపోతున్నాడు. అయినా సరే మళ్లీ మైదానంలో దిగాడు. MRI స్కాన్‌, ఎక్స్‌-రే పూర్తయ్యాయి. అతడు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడనే వార్తలు వచ్చాయి.

మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?
ఈ ఒక్క మ్యాచ్‌ కాదు.. అతడు సిరీస్‌ మొత్తానికి దూరమవుతాడని అనుకున్నారంతా! కానీ అతడు తిరిగి వచ్చాడు. మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?.. ఇలాంటి చిన్న చిన్న కష్టాలకు పంత్‌ లాంటి పోరాట యోధుడు తలవంచుతాడా?’’ అంటూ ఆకాశ్‌ చోప్రా పంత్‌ను ప్రశంసించాడు. 

కాగా 2022, డిసెంబర్లో పంత్‌ పెను ప్రమాదం నుంచి.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు నడుస్తాడా? లేదా? అన్న సందేహాల నడుమ.. రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా మునుపటి కంటే మెరుగ్గా ఆడుతూ అద్భుతాలు చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. మాంచెస్టర్‌ టెస్టులో భారత బ్యాటర్లు ఫరవాలేదనిపించినా.. బౌలర్లు తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌ రెండు వికెట్ల నష్టానికి 46 ఓవర్లలో 225 పరుగులు చేసింది. భారత్‌ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 133 పరుగులు మాత్రమే వెనుకబడి ఉండగా.. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. 

చదవండి: సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్‌ ఫైర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)