Breaking News

19 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్‌ అద్భుత విజయం

Published on Fri, 10/16/2026 - 23:33

రాయ్‌పూర్‌ వేదికగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

జింబాబ్వే బ్యాటర్లలో కెలిస్ ఎండ్‌లోవు (44 బంతుల్లో 42), షార్నే మేయర్స్ (33 బంతుల్లో 43 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో నందిని శర్మ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. షెఫాలీ వ‌ర్మ‌, అరుంధ‌తి రెడ్డి, శ్రీచ‌ర‌ణి త‌లా వికెట్ సాధించారు.

అరంగేట్రంలో అదుర్స్‌
అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు జింబాబ్వే రైటార్మ్ స్పిన్నర్ నిషా గ్వాంజురా బిగ్ షాకిచ్చింది.  కెప్టెన్‌ స్మృతి మంధానతో పాటు షెఫాలీ వర్మ, అనుష్కశర్మ(4)లను ఆరంభంలోనే నిషా గ్వాంజురా పెవిలియన్‌కు పంపింది.

మాజీ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా కేవలం ఒక్క పరుగు చేసి ఔటయైంది. దీంతో భారత్ కేవలం 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (49), అరంగేట్ర బ్యాటర్  నికి ప్రసాద్ (39 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నారు. ఫలితంగా ఈ స్వల్ప లక్ష్యాన్ని ఉమెన్ ఇన్ బ్లూ 15.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.
చదవండి: మొయిన్‌ అలీ మెరుపులు.. ఫైనల్లో ఇంగ్లండ్‌.. ఏబీడీకి షాక్‌!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)