Breaking News

అరంగేట్రంలోనే ఆసీస్‌ బ్యాటర్‌ విధ్వంసం.. విండీస్‌ చిత్తు

Published on Mon, 07/21/2025 - 10:18

వెస్టిండీస్‌తో తొలి టీ20 (WI vs AUS)లో ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. జమైకా వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది.

హోప్‌, చేజ్‌  హాఫ్‌ సెంచరీలు
టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన కంగారూలు.. టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేశారు. సబీనా పార్కులో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ ఆదిలోనే ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (18) వికెట్‌ కోల్పోయింది.

అయితే, మరో ఓపెనర్‌, కెప్టెన్‌ షాయీ హోప్‌ (39 బంతుల్లో 55), వన్‌డౌన్‌ బ్యాటర్‌ రోస్టన్‌ చేజ్‌ (60) అర్ధ శతకాలతో రాణించారు. షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (19 బంతుల్లో 38) తనదైన శైలిలో ధనాధన్‌ దంచికొట్టగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్‌ ఎనిమిది వికట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

ఆసీస్‌ బౌలర్లలో డ్వార్షుయిస్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సీన్‌ అబాట్‌, కూపర్‌ కన్నోలి, నాథన్‌ ఎల్లిస్‌, అరంగేట్ర ప్లేయర్‌ మిచెల్‌ ఓవెన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మార్ష్‌ బృందం 18.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది.

గ్రీన్‌, మిచ్‌ మెరుపు హాఫ్‌ సెంచరీలు
కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (24) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ (2), వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ (18) నిరాశపరిచారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (11) సైతం విఫలం కాగా.. కామెరాన్‌ గ్రీన్‌, మిచెల్‌ ఓవెన్‌ మెరుపు అర్ధ శతకాలతో చెలరేగారు. 

గ్రీన్‌ 26 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేయగా.. మిచెల్‌ ఓవెన్‌ 27 బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 50 పరుగులు సాధించాడు.

మిగతా వారిలో కూపర్‌ కన్నోలి 13 పరుగులు చేయగా.. డ్వార్షుయిస్‌ (5), సీన్‌ అబాట్‌ (5) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. విండీస్‌పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

పంజాబ్‌ కింగ్స్‌ప్లేయర్‌గా
కాగా ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడిన మిచెల్‌ ఓవెన్‌.. విండీస్‌తో తొలి టీ20 ద్వారా ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్రంలోనే ఈ 23 ఏళ్ల బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోవడం విశేషం. అంతేకాదు.. ఆసీస్‌ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా మిచ్‌ నిలిచాడు. 

చదవండి: నితీశ్‌ రెడ్డి అవుట్‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)