Breaking News

పాక్‌తో సిరీస్‌కు ఎంపిక.. ఆడేందుకు విండీస్‌ ప్లేయర్‌ నిరాకరణ!

Published on Sat, 07/25/2026 - 09:31

పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్ర‌వారం జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా విండీస్ బౌల‌ర్ అల్జారీ జోసెఫ్ పాక్‌తో సిరీస్‌కు దూర‌మైన‌ట్లు విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఇక్క‌డే ఊహించ‌ని ట్విస్ట్ ఒక‌టి ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడ‌డం త‌న‌కు ఇష్టం లేద‌న్న కార‌ణంగానే, జ‌ట్టులోకి ఎంపిక చేసిన‌ప్ప‌టికీ అల్జారీ జోసెఫ్ ఆడేందుకు నిరాక‌రించాడ‌ని విండీస్ కోచ్ డారెన్ సామీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. 

అల్జారీ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో సిరీస్ నుంచి త‌ప్పుకోలేద‌ని, పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు అత‌డు నిరాక‌రించ‌డంతో జట్టు నుంచి త‌ప్పించాల్సి వ‌చ్చింద‌ని సామీ పేర్కొన్నాడు. జోసెఫ్ లేక‌పోవ‌డం విండీస్‌కు పెద్ద లోటు అని, కానీ తమ జ‌ట్టు పాక్‌పై రాణిస్తుంద‌ని సామీ ధీమా వ్య‌క్తం చేశాడు. జ‌ట్టు ఎంపిక అనంత‌రం కోచ్ డారెన్ సామీ మీడియాతో మాట్లాడాడు. 

జోసెఫ్ వ్యవహారంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన సామీ మాట్లాడుతూ.. ‘అల్జారీ జోసెఫ్ పాక్‌తో ఆడేందుకు నిరాక‌రించిన విష‌యం నా పరిధిలో లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నఒక ఆట‌గాడు ఇలా జట్టు ఎంపికను తిరస్కరించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా లేదా పరిష్కారాలు క‌నుగొనాలన్నా అది బోర్డు డైరెక్టర్లకే వదిలేస్తున్నా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. 

29 ఏళ్ల అల్జారీ జోసెఫ్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో ఆడాడు. రెండు మ్యాచులలో 6 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అల్జారీ జోసెఫ్‌ వెస్టిండీస్ తరఫున 42 టెస్టులు ఆడాడు. ఇందులో ఏకంగా 130 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 141, 45 టీ20లలో 62 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్‌లలోనూ కీల‌క ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. వెస్టిండీస్, పాక్ మధ్య తొలి టెస్టు శనివారం ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి జరుగుతుంది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)