Breaking News

విండీస్‌ బ్యాటర్ల శతకాల మోత.. పూరన్‌ ఊచకోత

Published on Thu, 06/22/2023 - 16:19

CWC Qualifiers 2023 WI VS NEP: వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్‌ 22) జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్‌లో 15వ శతకాన్ని నమోదు చేయగా.. టీ20 స్పెషలిస్ట్‌ నికోలస్‌ పూరన్‌ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) నేపాల్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకాన్ని బాదాడు. 

ఫలితంగా  విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నేపాల్‌ బౌలర్లలో లలిత్‌ రాజ్‌బంశీ 3.. కరణ్‌, గుల్షన్‌ ఝా, సందీప్‌ లామిచ్చేన్‌, దీపేంద్ర సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఈ మ్యాచ్‌కు ముందు యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద 39 పరుగుల తేడాతో విజయం సాధించిన విండీస్‌.. పాయింట్ల పట్టికలో (గ్రూప్‌-ఏ) జింబాబ్వే తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్‌-బిలో ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఒమన్‌ టాపర్‌గా, శ్రీలంక, స్కాట్లాండ్‌ 2, 3 స్థానాల్లో నిలిచాయి.

2019 వరల్డ్‌కప్‌ తర్వాత హోప్‌ను మించినోడే లేడు..
విండీస్‌ వన్డే జట్టు కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ వన్డేల్లో భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అతను పట్టపగ్గాలు లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో హోప్‌ ఏకంగా 9 సెంచరీలు, 18 హాఫ్‌ సెంచరీలు బాది, అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్‌ల్లో 2153 పరుగులు) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హోప్‌కు కాస్త దగ్గరగా వచ్చిన బ్యాటర్‌  ఎవరైనా ఉన్నాడంటే అది బాబర్‌ ఆజమ్‌ అని చెప్పాలి. బాబర్‌ 28 ఇన్నింగ్స్‌ల్లో 1876 పరుగులు చేసి హోప్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)