జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించిన అనామక బ్యాటర్‌

Published on Sun, 06/18/2023 - 15:53

ఇవాళ (జూన్‌ 18) మొదలైన వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో అనామక జట్టు నేపాల్‌.. వారి కంటే ఎన్నో రెట్లు మెరుగైన జింబాబ్వేను గడగడలాడిస్తుంది. నేపాల్‌ టాపార్డర్‌ బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఆ జట్టు భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. ఓపెనర్‌ కుశాల్‌ భూర్టెల్‌ (95 బంతుల్లో 99; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించి, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మసకద్జ.. కుశాల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు.

మరో ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్‌ (66), కుశాల్‌ మాల్ల (41), రోహిత్‌ పౌడెల్‌ (31) రాణించారు. 47 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 271/5గా ఉంది. గుల్సన్‌ ఝా (6), దీపేంద్ర సింగ్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో వెల్లింగ్టన్‌ మసకద్జ, రిచర్డ్‌ నగరవా తలో 2 వికెట్లు, టెండాయ్‌ చటారా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

కాగా, వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు జింబాబ్వే వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. గ్రూప్‌-ఏలో భాగంగా నేపాల్‌-జింబాబ్వే జట్లు.. వెస్టిండీస్‌-యూఎస్‌ఏ జట్లు ఇవాళ తలపడుతున్నాయి. విండీస్‌-యూఎస్‌ఏ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న విండీస్‌.. 43 ఓవర్ల తర్వాత 243/6 స్కోర్‌ చేసింది. రోప్టన్‌ ఛేజ్‌ (45), జేసన్‌ హోల్డర్‌ (24) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో బ్రాండన్‌ కింగ్‌ (0), కైల్‌ మేయర్స్‌ (2), రోవ్‌మన్‌ పావెల్‌ (0) విఫలం కాగా.. జాన్సన్‌ ఛార్లెస్‌ (66), షాయ్‌ హోప్‌ (54), నికోలస్‌ పూరన్‌ (43) రాణించారు. యూఎస్‌ఏ బౌలర్లలో స్టీవెన్‌ టేలర్‌ 3, సౌరభ్‌ నేత్రావాల్కర్‌, కైల్‌ ఫిలిప్‌, నోషటష్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)