Breaking News

సంజూకు బదులు జడ్డూ, రుతురాజ్‌.. సీఎస్‌కే నిర్ణయం ఇదే..!

Published on Thu, 08/14/2025 - 10:21

ప్రస్తుతం ఐపీఎల్‌ వర్గాల్లో సంజూ శాంసన్‌ ట్రేడ్‌ డీల్‌కు సంబంధించిన అంశం హాట్‌హాట్‌గా నడుస్తుంది. సంజూ రాజస్థాన్‌ రాయల్స్‌ను వీడటం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో సీఎస్‌కే అతన్ని ట్రేడింగ్‌ ద్వారా దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. 

ట్రేడ్‌ డీల్‌లో భాగంగా రాయల్స్‌ సంజూకు బదులు సీఎస్‌కేకు చెందిన ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లను అడిగినట్లు సమాచారం. కొంత నగదుతో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌ లేదా శివమ్‌ దూబేలలో ఎవరో ఒకరిని డిమాండ్‌ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ డీల్‌కు సీఎస్‌కే యాజమాన్యం ససేమిరా అనిందని క్రిక్‌బజ్‌ పేర్కొంది.

సంజూకు బదులు నగదు డీల్‌ జరుగుతుందే కానీ, తమ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని వదులుకునేది లేదని సీఎస్‌కే రాయల్స్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ రాయల్స్‌, సీఎస్‌కే మధ్య డీల్‌ కుదరకపోతే సంజూను ట్రేడ్‌ డీల్‌ ద్వారా దక్కించుకునేందుకు వేరే ఫ్రాంచైజీలు కూడా పోటీపడవచ్చు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సంజూ ముందస్తు అగ్రిమెంట్‌ ప్రకారం​ 2027 సీజన్‌ వరకు రాయల్స్‌తోనే కొనసాగాల్సి వస్తుంది.

సీఎస్‌కేకు వెళ్లాలన్నది సంజూ వ్యక్తిగత ఆప్షన్‌గా తెలుస్తుంది. రాయల్స్‌లో ఇమడలేకపోవడంతో అతను సీఎస్‌కే వైపు చూస్తున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీ మారాలనుకున్న విషయాన్ని సంజూ చాలా గోప్యంగా ఉంచుతూనే లోలోపల పావులు కదుపుతున్నట్లు వినికిడి. 

మొత్తానికి సంజూ తమతో అసౌకర్యంగా ఉన్నాడన్న విషయాన్ని రాయల్స్‌ యాజమాన్యం గ్రహించింది. సంజూ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవించే అవకాశం ఉంది. ఏ ఫ్రాంచైజీతో ట్రేడ్‌ డీల్‌ కుదరకపోతే సంజూను వేలానికి వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సంజూకు రికార్డు ధర లభించే అవకాశం ఉంటుంది. సీఎస్‌కేతో పాటు కేకేఆర్‌, గుజరాత్‌ ఫ్రాంచైజీలు సంజూ కోసం ఎగబడవచ్చు.

 

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)