Breaking News

అర్జెంటీనా చీటింగ్‌.. కాక రేపుతున్న రొనాల్డో 'లైక్' వివాదం

Published on Wed, 07/22/2026 - 10:37

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో స్పెయిన్‌లో చేతిలో ఓట‌మి చ‌విచూసిన అర్జెంటీనా ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. అయితే టోర్నీ ఆరంభం నుంచి అర్జెంటీనాకు అనుకూలంగానే వ్య‌వ‌హరించ‌ద‌న్న విమ‌ర్శ‌లు బ‌హిరంగంగా వ్య‌క్త‌మ‌య్యాయి. ఫిఫాలో అర్జెంటీనాతో ఆడిన జ‌ట్ల‌లో చాలా జ‌ట్లు ఇదే ఆరోప‌ణ‌లు చేశాయి. 

ఈ వివాదం సోష‌ల్ మీడియాకు కూడా పాకింది. ఫైనల్‌కు అర్జెంటీనా చేరుకునే క్రమంలో ఫిఫా పక్షపాత ధోరణితో వ్యవహరించిందనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపించాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోకు పోర్చుగ‌ల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో లైక్ చేయ‌డమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.

దీంతో ఫిఫా వ్యవహారంపై వచ్చిన విమర్శలకు రొనాల్డో కూడా మద్దతు తెలిపాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారంపై జాతీయ మీడియా నిర్వహించిన ఫ్యాక్ట్‌చెక్‌లో భిన్నమైన విషయం వెలుగులోకి వచ్చింది. రొనాల్డో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోకు లైక్ చేసిన ఆనవాళ్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదని తెలిపింది. అయితే దీనిలో కూడా రెండు అంశాలు దాగున్నాయి. ఒక‌వేళ రొనాల్డో మొద‌ట లైక్ చేసి ఆ త‌ర్వాత దానిని తొల‌గించి ఉండొచ్చు. అదీ కాక‌పోతే మాత్రం ఇది పాత స్క్రీన్‌షాట్ అయ్యే అవ‌కాశం కూడా లేక‌పోలేదు.

ఈసారి ఫిఫాలో 48 జట్లు పోటీపడితే అర్జెంటీనాకు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా వీఏఆర్ (VAR) నిర్ణయం రాలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టుకు ఫిఫా అనుకూలంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

ముఖ్యంగా రౌండ్ ఆఫ్-16లో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం వీఏఆర్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తమ జట్టు చేసిన గోల్‌ను అనర్హంగా ప్రకటించడం వల్లే ఓటమి ఎదురైందని మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ కెప్టెన్‌తో పాటు ప్రధాన కోచ్ కూడా ఆరోపించారు. అయితే ఈ విమర్శలను ఫిఫా ఖండిస్తూ, మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి పక్షపాతం ప్రదర్శించలేదని స్పష్టం చేసింది.

ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో పోర్చుగ‌ల్ ప్ర‌యాణం ప్రిక్వార్ట‌ర్స్‌లోనే ముగిసింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడిన రొనాల్డోకు ఇదే చివ‌రిద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఈసారి ఫిఫాలో రొనాల్డో కూడా పెద్ద‌గా మెర‌వ‌లేదు. ఇప్ప‌టిదాకా రిటైర్మెంట్ విష‌యాన్ని ప్ర‌క‌టించని రొనాల్డో వ‌య‌సు 41 ఏళ్లు. దీంతో వ‌చ్చే ఫిఫా (2030) నాటికి రొనాల్డో ఆట‌కు గుడ్‌బై చెప్పే అవ‌కాశ‌ముంది.

Read: అత‌డి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జ‌ట్టు ప్ర‌క‌ట‌న వాయిదా!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)