Breaking News

వైభవ్‌ సూర్యవంశీ మామకు సివిల్స్‌లో బెస్ట్‌ ర్యాంక్‌

Published on Sat, 03/07/2026 - 14:41

భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ.. మైదానంలో పరుగుల వరద పారించడం ఈ పిల్లాడికి పరిపాటి అయిపోయింది. పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు ఈ బిహారీ అబ్బాయి.

యూత్‌ వన్డే, యూత్‌ టెస్టుల్లో అతి పిన్న వయసులోనే విధ్వంసకర శతకాలు బాదిన బ్యాటర్‌గా వైభవ్‌ చరిత్రకెక్కాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున మొదలైన అతడి పరుగుల ప్రవాహం.. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా కొనసాగుతోంది.

ఇటీవల ముగిసిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు చేసి.. భారత్‌ను గెలిపించాడు వైభవ్‌ (Vaibhav Suryavanshi). తద్వారా టీమిండియా వైపు తొలి అడుగు వేశాడు. ఇక ప్రస్తుతం వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌-2026 కోసం రాజస్తాన్‌ రాయల్స్‌తో కలిసి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.

పదో తరగతి పరీక్షలు డుమ్మా
ఇదిలా ఉంటే.. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వైభవ్‌ సూర్యవంశీ పేరు వైరల్‌ అవుతోంది. క్రికెట్‌తో బిజీగా ఉన్నందున అతడు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఈ విషయాన్ని వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ ధ్రువీకరించారు.

102వ ర్యాంకు
మరోవైపు.. తాజాగా సంజీవ్‌ సూర్యవంశీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వైభవ్‌ సూర్యవంశీకి వరుసకు మేనమామ అయిన అభిషేక్‌ చౌహాన్‌ (Abhishek Chauhan) యూపీఎస్‌సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 102వ ర్యాంకు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే అభిషేక్‌ ఈ మేర ర్యాంకు సాధించడం మరో విశేషం. ఆయన ఐపీఎస్‌ సర్వీస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఉన్నత విద్యావంతుల కుటుంబం
బిహార్‌లోని సమస్తిపూర్‌లో గల మొహియుద్దీన్‌నగర్‌ బ్లాక్‌లో గల రాజాజన్‌ గ్రామంలో 1999లో అభిషేక్‌ చౌహాన్‌ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్‌ అభయ్‌ కుమార్‌ సింగ్‌, తల్లి అనురాధా రాజ్‌పుత్‌. అభయ్‌ కుమార్‌ సింగ్‌ నలంద ఓపెన్‌ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. 

ఇక ఎంటెక్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అభిషేక్‌ 2022 నుంచి సివిల్స్‌ పరీక్షకు సన్నద్ధం అయ్యారు. 2025లో తొలిసారి పరీక్ష రాయగా.. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. దీంతో సమస్తిపూర్‌లో సంతోషకర వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితుల రాకతో హడావుడిగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ.. అభిషేక్‌ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు