Breaking News

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం వాయిదా?

Published on Fri, 06/12/2026 - 09:26

ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో హింసాత్మక అల్లర్లు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు. బుధవారం సాయంత్రం నగరంలోని పలు వీధుల్లో ముసుగులు ధరించిన కొంతమంది ఇళ్లు, వ్యాపార సముదాయాలు, కార్లు సిటీ బస్సులకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి వాటర్ క్యానన్లను ప్రయోగించారు.

జూన్ 8వ తేదీ రాత్రి బెల్ఫాస్ట్‌లో ఒక వ్యక్తిపై జరిగిన దారుణమైన కత్తిపోట్ల దాడి ఈ హింసకు దారితీసింది. ఈ దాడికి పాల్పడిన నిందితుడు వేరే దేశానికి చెందిన వలసదారుడు అనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో స్థానికంగా వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలై, అవి కాస్తా హింసాత్మక అల్లర్లుగా మారాయి.

భారత్‌-ఐర్లాండ్ సిరీస్ డౌటే!
కాగా నెల‌ఖారులో భార‌త క్రికెట్ జ‌ట్టుకు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల్సింది. ఈ రెండు మ్యాచ్‌లు (జూన్ 26, 28) కూడా బెల్‌ఫాస్ట్ వేదిక‌గానే జ‌ర‌గాల్సి ఉంది. ఇప్పుడు అక్క‌డ నెల‌కొన్న ఉద్రిక్త‌ల కార‌ణంగా ఈ టీ20 సిరీస్ జ‌రుగుతుందా?  లేదా? అన్న అనుమానాలు నెల‌కొన్నాయి.

తాజాగా ఇదే విష‌యంపై ఐర్లాండ్ క్రికెట్ స్పందించింది. భారత్‌తో జరగాల్సిన రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిర్వ‌హ‌ణ‌పై రాబోయే 48 గంటల్లో తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఐరీష్ క్రికెట్ బోర్డు తెలిపింది.

బెల్‌ఫాస్ట్ నెలకొన్న పరిస్థితులను 'క్రికెట్ ఐర్లాండ్' నిశితంగా గమనిస్తోంది. భారత్‌తో టీ20 సిరీస్‌తో పాటు, ఈ ఆదివారం జరగాల్సిన 'ఐరిష్ సీనియర్ కప్', 'నేషనల్ కప్' మ్యాచ్‌ల నిర్వహణపై కూడా రాబోయే రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అధికారులు, అభిమానుల భద్రతే మాకు అత్యంత ముఖ్యమ‌ని" ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న పేర్కొంది. 

వైభవ్‌ డెబ్యూ వాయిదా?
కాగా ఈ టూర్ కోసం ఇప్ప‌టికే బీసీసీఐ 15 మంది స‌భ్యులతో కూడిన భారత జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎంపిక‌య్యాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ నుంచి త‌ప్పించి అయ్య‌ర్‌కు జ‌ట్టు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. 

కాగా ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కింది. భారత జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్‌ రికార్డును వైభవ్‌(15) బ్రేక్‌ చేశాడు. ఒకవేళ ఈ సిరీస్‌ వాయిదా పడితే సూర్యవంశీ అరంగేట్రం కోసం ఇంగ్లండ్‌ టూర్‌ వరకు వేచిచూడాల్సిందే. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా అతడు ఎంపికయ్యాడు.
చదవండి: FIFA World Cup 2026: ఆరంభంలోనే ఆల్‌టైమ్‌ రికార్డు.. ఫిఫా హిస్టరీలోనే మొదటిసారి
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు