Breaking News

చరిత్ర సృష్టించిన కీరన్‌ పోలార్డ్‌.. ప్రపంచంలో తొలి ఆటగాడు

Published on Tue, 09/23/2025 - 16:53

విండీస్‌ టీ20 దిగ్గజం కీరన్‌ పోలార్డ్‌ (Kieron Pollard) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్‌లో 400 క్యాచ్‌లు అందుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పాడు.

కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025 ఫైనల్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టిన అనంతరం పోలార్డ్‌ టీ20 క్యాచ్‌ల సంఖ్య 401కి (720 మ్యాచ్‌ల్లో) చేరింది.

‍ప్రపంచంలో ఏ వికెట్‌కీపర్‌ కానీ, ఫీల్డర్‌ కానీ ఇన్ని క్యాచ్‌లు పట్టలేదు. ఈ రికార్డుకు సంబంధించి పోలార్డ్‌ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. 321 క్యాచ్‌లతో డేవిడ్‌ మిల్లర్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

విండీస్‌ తరఫున అంతర్జాతీయ టీ20లతో పాటు ఐపీఎల్‌, సీపీఎల్‌ తదితర టీ20 లీగ్‌ల్లో కలిపి పోలార్డ్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. పోలీ ఈ ఫీట్‌ను సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ విజయం సాధించి, ఐదోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ అమెజాన్‌ వారియర్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగా.. నైట్‌రైడర్స్‌ మరో 2 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టి వారియర్స్‌ను దెబ్బకొట్టిన పోలార్డ్‌.. బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ (12 బంతుల్లో 21; 3 సిక్సర్లు) ఆడి నైట్‌రైడర్స్‌ గెలుపును ఖరారు చేశాడు.

ఈ ఎడిషన్‌ ఆధ్యాంతం ఇదే ప్రదర్శనలతో చెలరేగినందుకు గానూ పోలార్డ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది. ఈ ఎడిషన్‌తో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 175 స్ట్రయిక్‌రేట్‌తో 383 పరుగులు చేశాడు. ఇందులో 36 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో ఇన్ని సిక్సర్లు ఎవరూ బాదలేదు.

నైట్‌రైడర్స్‌ గెలుపుతో పోలార్డ్‌ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. పొట్టి క్రికెట్‌ చరిత్రలో అత్యధిక టైటిల్స్‌ (18) గెలిచిన ఆటగాడిగా సహచరుడు డ్వేన్‌ బ్రావో (17) రికార్డును అధిగమించాడు. టైటిల​్‌ గెలిచిన నైట్‌రైడర్స్‌కు బ్రావో కోచ్‌ కావడం​ విశేషం. 

చదవండి: అశ్విన్‌కు జాక్‌పాట్‌.. ఎవరికీ దక్కని ధర..!

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు