Breaking News

Riyan Parag: ఓవరాక్షన్‌ ప్లేయర్‌ అన్న నోళ్లతోనే శభాష్‌ అనిపించుకున్నాడు..!

Published on Fri, 08/04/2023 - 15:09

ఆన్‌ ఫీల్డ్‌ బిహేవియర్‌ కారణంగా ఓవరాక్షన్‌ ప్లేయర్‌గా ముద్ర వేసుకున్న టీమిండియా యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌.. తనను తిట్టిన నోళ్లతోనే పొగిడించుకుంటున్నాడు. ఆట కంటే అతి ఎక్కువగా చేసి బాగా పాపులరైన రియాన్‌.. తాజాగా ముగిసిన దియోదర్‌ ట్రోఫీ-2023లో బ్యాట్‌తో బంతితో చెలరేగి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. దియోదర్‌ ట్రోఫీలో 5 మ్యాచ్‌లు ఆడిన రియాన్‌.. 2 సెంచరీలు, అర్ధసెంచరీ సాయంతో 88.50 సగటున 354 పరుగులు చేసి టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన రియాన్‌.. బంతితోనూ మెరిశాడు. 19.09 సగటున 11 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీసిన రియాన్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. తన జట్టు (ఈస్ట్‌ జోన్‌) కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన రియాన్‌.. మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచాడు. సౌత్‌ జోన్‌తో నిన్న (ఆగస్ట్‌ 3) జరిగిన ఫైనల్లోనూ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న 21 ఏళ్ల రియాన్‌.. తన జట్టును గెలిపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు.

తొలుత బంతితో (2/68) మ్యాజిక్‌ చేసిన రియాన్‌.. ఆ తర్వాత బ్యాట్‌తో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న రియాన్‌.. 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కుమార్‌ కుషాగ్రాతో (68) కలిసి కీలక భాగాస్వామ్యం నెలకొల్పిన రియాన్‌.. ఆరో వికెట్‌గా వెనుదిరగడంతో ఈస్ట్‌ జోన్‌ ఓటమి ఖరారైంది. 

కాగా, దియోదర్‌ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌ జోన్‌.. రోహన్‌ కున్నుమ్మల్‌ (107), మయాంక్‌ అగర్వాల్‌ (63) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఈస్ట్‌ జోన్‌.. 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈస్ట్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో రియాన్‌ పరాగ్‌, కుషాగ్రా మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు.

దియోదర్‌ ట్రోఫీ-2023లో రియాన్‌ పరాగ్‌ స్కోర్లు, వికెట్లు..

  • నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై 13 పరుగులు, 4 వికెట్లు
  • నార్త్‌ జోన్‌పై 131 పరుగులు, 4 వికెట్లు
  • సౌత్‌ జోన్‌పై 13 పరుగులు, ఒక వికెట్‌
  • వెస్ట్‌ జోన్‌పై 102 నాటౌట్‌
  • ఫైనల్లో సౌత్‌ జోన్‌పై 95 పరుగులు, 2 వికెట్లు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)