Breaking News

T20 WC: ఆసీస్‌ కాదు.. ఆ జట్టు: ఊహించని పేరు చెప్పిన దిగ్గజం

Published on Wed, 05/29/2024 - 21:51

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్‌ 1న మొదలుకానుంది.

అమెరికా- కెనడా జట్ల మధ్య డల్లాస్‌ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈసారి ఏకంగా 20 జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నా.. పోటీ మాత్రం ప్రధానంగా సూపర్‌-8 జట్ల మధ్యే ఉండనుంది.

ఆ నాలుగు జట్లకు మెజారిటీ ఓట్లు
టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్, వెస్టిండీస్‌‌ టైటిల్‌ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేసిన విషయం తెలిసిందే.

ఊహించని పేరు చెప్పిన లారా
మెజారిటీ మంది టీమిండియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ పేర్లు చెప్పగా.. విండీస్‌‌ దిగ్గజం బ్రియన్‌ లారా మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. టీమిండియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌తో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్‌ జట్టుకు తన టాప్‌-4లో స్థానమిచ్చాడు.

గావస్కర్‌ టాప్‌-4 జట్లు ఇవే
అండర్‌డాగ్స్‌గా టీ20 ప్రపంచకప్‌-2024లో అడుగుపెట్టే అఫ్గన్‌.. ఈసారి కచ్చితంగా సెమీస్‌ చేరే అవకాశం ఉందని లారా అంచనా వేశాడు. మరోవైపు.. టీమిండియా లెజెండ్‌ సునిల్‌ గావస్కర్‌ ఇండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ ఈసారి సెమీస్‌ చేరతాయని జోస్యం చెప్పాడు.

చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్‌ పాండ్యా పోస్ట్‌ వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)