Breaking News

పాక్‌తో రెండో టెస్ట్‌.. విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ

Published on Wed, 08/05/2026 - 19:54

పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్‌ బ్రాండన్‌ కింగ్‌ గాయం కారణంగా మ్యాచ్‌లో మిగిలిన భాగానికి దూరమయ్యాడు. ఆగస్టు 4న మూడో రోజు ఆట సందర్భంగా అతడికి తీవ్ర లోయర్‌ బ్యాక్‌ మసిల్‌ స్పాసమ్స్‌ వచ్చాయి.

పాక్‌ ఇన్నింగ్స్‌లో 75వ ఓవర్‌ సందర్భంగా బాబర్‌ ఆజమ్‌ రనౌట్‌లో కింగ్‌ కీలక పాత్ర పోషించాడు. బాబర్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించగా, తిరిగి క్రీజులోకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కవర్‌ ప్రాంతం నుంచి కింగ్‌ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో బాబర్‌ రనౌట్‌ అయ్యాడు.

అయితే ఈ అద్భుతమైన ఫీల్డింగ్‌ ప్రయత్నం కింగ్‌కు తీవ్ర గాయాన్ని మిగిల్చింది. బంతిని అందుకుని డైరెక్ట్‌ త్రో వేసే సమయంలో అతడు ఇబ్బందికరంగా ల్యాండ్‌ కావడంతో వెన్ను కండరాల్లో తీవ్ర నొప్పి వచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

క్రికెట్‌ వెస్టిండీస్‌ వైద్య బృందం ప్రాథమిక పరీక్షల అనంతరం కింగ్‌కు లోయర్‌ బ్యాక్‌ మసిల్‌ స్పాసమ్స్‌ ఉన్నట్లు నిర్ధారించింది. వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. గాయం మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో మిగిలిన మ్యాచ్‌కు అతడిని దూరంగా ఉంచారు.

కింగ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. అతడి గైర్హాజరీ వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌కు రాలేడు.

కింగ్‌ లేని లోటు ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలుపోటములను శాశించే స్థితిలో ఉంది. ఆట నాలుగో రోజు విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా పతనమైంది. తొలి సెషన్‌ సమయానికి ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. జస్టిన్‌ గ్రీవ్స్‌ (3), షమార్‌ జోసఫ్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. 

మరో రెండు వికెట్లు పడితే విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగుస్తుంది. సాజిద్‌ ఖాన్‌ (4 వికెట్లు), అలీ ఉస్మాన్‌ (3 వికెట్లు) విండీస్‌ను ఘెరంగా దెబ్బతీశారు. ప్రస్తుతం విండీస్‌ కేవలం 72 పరుగుల లీడ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఓటమి తప్పించుకోవాలంటే ఏదైనా మహాద్భుతమే జరగాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ గెలవడంతో విండీస్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)