Breaking News

భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 10/05/2025 - 15:20

భారత మూలాలున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలికాలంలో తరుచూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును (PCB) ఎండగడుతూ, భారత్‌పై ప్రేమను వ్యక్తపరుస్తున్న డానిష్‌.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. భారత్‌పై అతి ప్రేమను ఒలకబోస్తున్నాడని ​కొందరు పాకిస్తానీలు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో డానిష్‌ ఇలా స్పందించాడు.

ఇటీవలికాలంలో కొందరు పాకిస్తానీలు నన్ను ప్రశ్నిస్తున్నారు. భారత మూలాలున్నా, క్రికెటర్‌గా ఎదిగేందుకు పాకిస్తాన్‌ ఇన్ని అవకాశాలు ఇస్తే.. భారత్‌కు సానుకూలంగా ఎందుకు మాట్లాడతావని నిలదీస్తున్నారు. భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నాని కామెంట్లు చేస్తున్నారు.

నాపై సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న ఈ మాటల దాడిపై స్పందించాల్సిన సమయం వచ్చింది. ముందుగా పాకిస్తాన్‌ ప్రజలకు నేను కృతజ్ఞుడిని. వారి నుంచి నాకు ఎంతో ప్రేమ లభించింది. అయితే కొందరు మాత్రం నా పట్ల చాలా వ్యతిరేక భావంతో వ్యవహరించారు.

ముఖ్యంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు. పీసీబీలోని కొందరు అధికారుల నుంచి నేను తీవ్ర వివక్షను ఎదుర్కొన్నాను. ఓ దశలో బలవంతంగా మతం మార్చించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కొందరు నేను భారత పౌరసత్వం ఆశిస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి నాకు అలాంటి ఉద్దేశం లేదు. భవిష్యత్తులో అలాంటి అవసరం ఉన్నా, CAA లాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి.

పౌరసత్వం కోసం నేను భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నానడం చాలా తప్పు. భారత్ నా పూర్వీకుల భూమి. అది నాకు దేవాలయం లాంటిది. పాకిస్తాన్ నా జన్మభూమే. కానీ భారత్‌ నా మాతృభూమి అంటూ తన ‘X’ ఖాతాలో రాసుకొచ్చాడు.

కాగా, డానిష్‌ కనేరియా పాకిస్తాన్‌లో పుట్టి పెరిగనప్పటికీ.. అతని పూర్వీకుల మూలాలు భారత్‌లోని గుజరాత్‌ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తుంది. 1980 డిసెంబర్‌ 16న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించిన డానిష్‌.. 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు తీసి పాక్ తరఫున గొప్ప స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 

అయితే స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కోవడంతో అతని కెరీర్‌ అర్దంతరంగా ముగిసింది. దీని కారణంగా అతను జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతను కుటుంబంతో పాటు అమెరికాలో ఉంటున్నాడు. 

చదవండి: వన్డే కెప్టెన్‌గా ఎంపిక.. శుబ్‌మన్‌ గిల్‌ ‘బోల్డ్‌’ రియాక్షన్‌

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)