amp pages | Sakshi

గుడ్డిలో మెల్ల.. తొలి టెస్టు కంటే మెరుగ్గానే

Published on Fri, 02/17/2023 - 18:42

IND Vs AUS 2nd Test Day-1 Analysis.. ఢిల్లీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆటలో టీమిండియానే ఆధిపత్యం కనబరిచింది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌లో మహ్మద్‌ షమీ నాలుగు వికెట్లతో చెలరేగడం చూస్తుంటే ఆస్ట్రేలియా పేసర్లకు కూడా ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో వికెట్లు తీసేందుకు మంచి అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. 

అయితే తొలి టెస్టుతో పోలిస్తే ఆసీస్‌ బ్యాటింగ్‌ కాస్త మెరుగ్గా అనిపించింది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా రెండో టెస్టులో మాత్రం తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 81 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు  వార్నర్‌ మాత్రం తన వైఫల్యాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. ఇక తొలి టెస్టులో పర్వాలేదనిపించిన వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మాత్రం మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ స్పిన్‌ దెబ్బకు స్మిత్‌ తోకముడిచాడు.

ఆ తర్వాత పనిని జడేజా కానిచ్చాడు. ఖవాజా వికెట్‌ను ఖాతాలో వేసుకున్న జడేజా ఆఖర్లో మరో రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అయితే జట్టులో మూడో స్పిన్నర్‌గా ఉన్న అక్షర్‌ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో కూడా ఒక్క వికెట్‌ దక్కలేదు. ఇక తన పేస్‌ పదును చూపించిన షమీ మొదట వార్నర్‌ను, మధ్యలో ట్రెవిస్‌ హెడ్‌ను.. చివరి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకొని మొత్తానికి తొలిరోజు హీరో అయ్యాడు.

ఇక స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుదని క్యురేటర్‌ పేర్కొన్నప్పటికి అలా జరగలేదు. స్పిన్నర్లు ప్రభావం చూపించినప్పటికి టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ అంతకుమించి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియాకు రెండో టెస్టులో ఏదైనా ఓదార్పు ఉందంటే మూడు సెషన్ల పాటు బ్యాటింగ్‌ చేయడమే. గుడ్డిలో మెల్ల కనీసం రెండు వందల స్కోరైనా చేసంది. మరి రెండో రోజు ఆటలో ఆసీస్‌ పేసర్లు జూలు విధిస్తారా.. స్పిన్నర్లు ఏమైనా మ్యాజిక్‌ చేస్తారా అన్నది వేచి చూడాలి. 

చదవండి: 'చేసేయాల్సింది ఒక పని అయిపోయేది..'

ఆఖర్లో హైడ్రామా.. వెనక్కి వచ్చేయాలంటూ క్రికెటర్లకు పిలుపు

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌