Breaking News

ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2022 ఎవరంటే?

Published on Thu, 01/26/2023 - 15:26

ICC Men’s Test Cricketer of the Year 2022: ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2022 అవార్డు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ను వరించింది. గతేడాది అద్భుత ప్రదర్శనకు గానూ అతడికి ఈ గౌరవం లభించింది. జో రూట్‌ తర్వాత ఇంగ్లండ్‌ టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఈ ఆల్‌రౌండర్‌.. ఇటు ఆటగాడిగా.. అటు కెప్టెన్‌గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.

కెప్టెన్‌గా, ఆటగాడిగా సూపర్‌ హిట్‌
బ్రెండన్‌ మెకల్లమ్‌తో కలిసి బజ్‌బాల్‌ విధానంతో సంప్రదాయ క్రికెట్‌లోనూ విధ్వంసకర ఆట తీరుతో జట్టును విజయపథంలో నడుపుతున్నాడు స్టోక్స్‌. వ్యక్తిగతంగానూ ఉత్తమంగా రాణిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. గతేడాది టెస్టుల్లో మొత్తంగా 870 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. అదే విధంగా 26 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైట్‌ఆర్మ్‌ మీడియం పేసర్‌.

ఇంగ్లండ్‌కు సారథ్యం వహించిన 10 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించాడు. ఇలా ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకున్న స్టోక్స్‌ను టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికచేసినట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి గురువారం వెల్లడించింది. కాగా ఐసీసీ టెస్టు జట్టుకు బెన్‌స్టోక్స్‌ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. 

చదవండి: ICC ODI Cricketer: ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఎవరంటే?
Rajat Patidar: అలా అయితే ఇషాన్‌ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ..

Videos

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)