Breaking News

బ్యాటింగ్‌ చేయడు.. చెత్త ఫీల్డింగ్‌: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Published on Tue, 03/03/2026 - 19:13

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆట తీరుపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ చేసిన పరుగులు 80. ఇందులో మూడు డకౌట్లు.. ఓ హాఫ్‌ సెంచరీ ఉన్నాయి.

సూపర్‌-8 దశలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అభిషేక్‌ శర్మ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్‌కు ముందు భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి.. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) ఆట తీరుపై మండిపడ్డాడు. నిర్లక్ష్యంగా ఆడితే.. తుదిజట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ..

తక్కువ సమయంలోనే సూపర్‌ స్టార్‌గా
‘‘వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే చెత్త షాట్లతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతి తక్కువ సమయంలోనే అభిషేక్‌ శర్మ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. భవిష్యత్తులోనూ సూపర్‌స్టార్‌గా కొనసాగాలంటే జట్టుకు విజయాలు అందించాలి.

భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీపడుతున్నారు. ఎంతో మంది మ్యాచ్‌ విన్నర్లుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. వాళ్లందరినీ దాటి జట్టులో కొనసాగాలంటే మెరుగ్గా ఆడాలి. 

బ్యాటింగ్‌ చేయడు.. చెత్త ఫీల్డింగ్‌
వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతడు బ్యాట్‌ ఝులిపించాల్సింది. అంతేకాదు రెండు క్యాచ్‌లు జారవిడిచి.. చెత్త ఫీల్డింగ్‌తోనూ నిరాశపరిచాడు. అతడి మైండ్‌సెట్‌ ఇప్పటికైనా మారాలి’’ అని మనోజ్‌ తివారి అభిషేక్‌ శర్మ ఆట తీరును విమర్శించాడు. 

మరోవైపు.. భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం అభిషేక్‌ ఫామ్‌లేమిపై ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న ఈ టీమిండియా ఓపెనర్‌ ఆటపై అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు.

చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)