BCCI: ఇద్దరు టీమిండియా కోచ్‌లపై వేటు!.. అతడు మాత్రం..

Published on Mon, 07/28/2025 - 15:59

గత కొన్నాళ్లుగా టీమిండియా టెస్టుల్లో నిరాశపరుస్తోంది. ముఖ్యంగా గౌతం గంభీర్‌ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడుతోంది. స్వదేశంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ చేదు అనుభవం చవిచూసింది.

కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2025 ఫైనల్‌ చేరే అవకాశాన్ని కూడా టీమిండియా కోల్పోయింది. డబ్ల్యూటీసీ మొదలుపెట్టిన తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన భారత్‌.. ఈసారి మాత్రం ఇలా డీలాపడింది.

అయితే, గత వైఫల్యాలు మరిచి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్‌ను ఆరంభించిన టీమిండియా.. ఇంగ్లండ్‌ పర్యటనలోనూ నిరాశపరుస్తోంది. కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలో... టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా లీడ్స్‌లో ఓడిపోయిన టీమిండియా.. ఎడ్జ్‌బాస్టన్‌లో మాత్రం తొలిసారి గెలుపు జెండా ఎగురవేసింది.

అనంతరం లార్డ్స్‌లో ఓడిపోయిన గిల్‌ సేన... తాజాగా మాంచెస్టర్‌లో ముగిసిన నాలుగో టెస్టులో ‘డ్రా’ తో గట్టెక్కింది. ఇక ఓవల్‌ మైదానంలో.. ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది. లేదంటే.. విదేశీ గడ్డపై వరుసగా రెండోసారి భంగపాటు తప్పదు.

నిజానికి లీడ్స్‌, లార్డ్స్‌లో వ్యూహాత్మ​క తప్పిదాల వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోయింది. ముఖ్యంగా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సేవలు వాడుకోకపోవడం.. కరుణ్‌ నాయర్‌ విఫలమవుతున్నా వరుస అవకాశాలు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ క్రమంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పై వేటు వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

అయితే, గంభీర్‌పై నమ్మకం ఉంచిన యాజమాన్యం బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌, అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటేలపై మాత్రం వేటు వేయనున్నట్లు సమాచారం. ‘ది టెలిగ్రాఫ్‌’ కథనం ప్రకారం..  ఆసియా కప్‌-2025 ముగిసిన తర్వాత వీళ్లిద్దరికి ఉద్వాసన పలికేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) రంగం సిద్ధం చేసింది. 

వెస్టిండీస్‌తో అక్టోబరులో జరిగే సిరీస్‌కు ముందే వీరిపై వేటు వేయనుంది. మోర్కెల్‌ బౌలింగ్‌ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా బౌలింగ్‌ విభాగంలో పెద్దగా మార్పులేమీ రాలేదని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మరోవైపు.. అసిస్టెంట్‌ కోచ్‌గా డష్కాటే సేవలు కూడా అంత గొప్పగా లేవనే భావనలో ఉంది. ఈ నేపథ్యంలోనే మోర్కెల్‌, డష్కాటేలను సాగననంపేందుకు బోర్డు సిద్ధమైంది.

కాగా గంభీర్‌ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్‌, డష్కాటేలతో పాటు అభిషేక్‌ నాయర్‌ను మేనేజ్‌మెంట్‌ అతడి సహాయక సిబ్బందిలో చేర్చింది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అభిషేక్‌ నాయర్‌పై వేటు వేసిన బీసీసీఐ... తాజాగా మోర్నీ, డష్కాటేల భవితవ్యంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)