Breaking News

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?

Published on Mon, 09/29/2025 - 08:14

టీ20 ఫార్మాట్‌లో తమకు తిరుగులేదని భార‌త జ‌ట్టు మ‌రోసారి నిరూపించుకుంది. ఆసియాక‌ప్‌-2025 విజేత‌గా టీమిండియా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టు.. రికార్డు స్థాయిలో తొమ్మిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 

దీంతో  సామాన్యుని నుంచి ప్రధాని వరకు భారత సూర్య అండ్ కోపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఈ చారిత్ర‌త్మ‌క విజ‌యంలో భాగ‌మైన ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల భారీ రివార్డు ఇవ్వ‌నున్న‌ట్లు బీసీసీఐ వెల్ల‌డించింది.

మూడు దెబ్బలు..  అస్సలు సమాధానమే లేదు. ఆసియా కప్‌ చాంపియన్స్, కావాల్సిన సందేశం అందించాం. జట్టుకు, సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల బహుమతి అంటూ ఫైన‌ల్ అనంత‌రం బీసీసీఐ ఎక్స్‌లో పేర్కొంది. కాగా ఈ ఖండాంతర టోర్నీలో మొత్తంగా మూడు సార్లు పాక్‌ను భార‌త్ చిత్తు చేసింది.

అద‌ర‌గొట్టిన తిల‌క్‌..
ఇక భారత్ ఛాంపియ‌న్స్‌గా నిల‌వ‌డంలో హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మది కీల‌క పాత్ర‌. 147 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో తిల‌క్ మ‌రుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. ల‌క్ష్య చేధ‌న‌లో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిల‌క్‌ త‌న వీరొచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

తిల‌క్‌ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 69 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవ‌ర్ల‌లో అందుకుంది. తిల‌క్ వ‌ర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు ద‌క్కగా.. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.
చదవండి: Asia Cup 2025: ప‌ట్టు బ‌ట్టిన పీసీబీ చైర్మెన్‌.. ఊహించని షాకిచ్చిన భార‌త్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)