Breaking News

IND vs PAK: థాంక్యూ.. బీసీసీఐ రియాక్షన్‌ వైరల్‌

Published on Tue, 02/10/2026 - 13:41

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ యథావిధిగా జరుగనుంది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న దాయాదులు ముఖాముఖి పోరులో తలపడేందుకు పాక్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) జోక్యంతో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

థాంక్యూ చెబుతున్నా
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) స్పందించిన తీరు వైరల్‌గా మారింది. బీసీసీఐ తరఫున ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఐసీసీ చైర్మన్‌ (జై షా), ఆఫీస్‌ బేరర్లకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఈ సమస్యకు సరైన పరిష్కారం వెదికినందుకు బీసీసీఐ తరఫున నేను ఐసీసీకి థాంక్యూ చెబుతున్నా.

అతిపెద్ద విజయం ఇది
పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డులతో చర్చించి.. అన్ని వర్గాల వాదనలు విని ఐసీసీ సమస్యను పరిష్కరించింది. క్రికెట్‌ మనుగడలో ఇది అత్యంత కీలక నిర్ణయం. ఆట కొనసాగుతూనే ఉండాలి. ప్రపంచకప్‌ విజయవంతం కావాలి. ఐసీసీ సాధించిన అతిపెద్ద విజయం ఇది.

బంగ్లాదేశ్‌ బోర్డు కూడా ఐసీసీని ప్రశంసించింది. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతిమంగా క్రికెట్‌ ఒక్కటే అందరికీ ముఖ్యమైనది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ సజావుగా సాగాలి’’ అని రాజీవ్‌ శుక్లా ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు.

భద్రతా కారణాలు చూపుతూ బంగ్లా
కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న మొదలైన ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్‌ తప్పుకొంది. భారత్‌లో తాము మ్యాచ్‌లు ఆడలేమంటూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో తమను ఆడించాలన్న అభ్యర్థనను తిరస్కరించడంతో టోర్నీ నుంచి వైదొలిగింది.

మధ్యలో ఎంటరైన పాక్‌
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్‌ సైతం తాము టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చింది. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. క్రికెట్‌ ప్రపంచంలో అత్యంత క్రేజ్‌ ఉన్న ఈ మ్యాచ్‌ జరుగకపోతే ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది.

ఈ ప్రభావం బంగ్లా, పాక్‌లతో పాటు అన్ని సభ్య దేశాల మీదా పడుతుంది. ఈ నేపథ్యంలో లాహోర్‌లో పాక్‌, బంగ్లా బోర్డు అధికారులతో చర్చలు జరిపిన ఐసీసీ బృందం.. పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ ఆడేలా ఒప్పించింది. ఎప్పటిలాగే ముందు నుంచి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్‌.. యూటర్న్‌ తీసుకుని టీమిండియాతో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది.

చదవండి: IND vs PAK: పాక్‌ యూటర్న్‌.. స్పందించిన ఐసీసీ

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు