T20 WC 2026: టీమిండియాకు శుభవార్త

Published on Tue, 01/27/2026 - 08:52

టీమిండియా యువ ఆటగాడు తిలక్‌ వర్మ గురించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్‌డేట్‌ అందించింది. అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఈ హైదరాబాదీ బ్యాటర్‌ పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు  తిలక్‌ వర్మ కూడా దూరమైనట్లు వెల్లడించింది.

ఓ శుభవార్త కూడా
అదే సమయంలో టీ20 వరల్డ్‌ కప్‌-2026 టోర్నీకి మాత్రం తిలక్‌ అందుబాటులోకి రానున్నట్లు బీసీసీఐ తెలిపింది.  వన్‌డౌన్‌లో నిలకడైన ఆట తీరుతో పరుగులు రాబడుతూ కీలకంగా మారిన తిలక్‌ వర్మ (Tilak Varma) అందుబాటులోకి వస్తే బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరింత బలపడటం ఖాయం. టీమిండియాకు ఇది సానుకూలాంశంగా మారనుంది.

కాగా తిలక్‌ ప్రస్తుతం బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను అందుకొని మెగా టోర్నీ ప్రారంభానికి ముందు తిలక్‌ వర్మ టీమిండియాతో చేరనున్నాడు. 

జట్టుతోనే శ్రేయస్‌ అయ్యర్‌
ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ... ఫిబ్రవరి 3న భారత బృందంతో తిలక్‌ కలుస్తాడని బీసీసీఐ ప్రకటించింది. తిలక్‌ గైర్హాజరులో కివీస్‌తో తొలి మూడు టీ20ల కోసం  ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్‌ సిరీస్‌ ముగిసే వరకు జట్టుతో కొనసాగనున్నాడు. కాగా కివీస్‌తో తొలి మూడు టీ20లో గెలిచి ఇప్పటికే టీమిండియా సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

చదవండి: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌.. కలకలం రేపుతున్న పీసీబీ చీఫ్‌ నఖ్వీ ట్వీట్‌

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)