Breaking News

గంభీర్‌కు పదవీ గండం!.. అత‌డితో చ‌ర్చ‌లు జ‌రిపిన బీసీసీఐ?

Published on Sat, 12/27/2025 - 18:57

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విజయవంతమైనప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గంభీర్ పర్యవేక్షణలో సేనా(సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా) దేశాలపై భారత్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా గత నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అతడిని వెంటనే ప్రధాన కోచ్‌గా తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో బీసీసీఐ కూడా హెడ్ కోచ్ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.  టెస్టు జట్టు కోసం ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలన్న యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో హెడ్ కోచ్ పదవి కోసం లెజెండరీ బ్యాటర్‌  వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు ప్రతినిధులు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను లక్ష్మణ్‌ను తిరష్కరించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) హెడ్‌గా ఉన్నాడు. అయితే  ప్రస్తుత  బాధ్యతలతోనే తను సంతోషంగా ఉన్నానని, సీనియర్ జట్టు కోచింగ్‌పై ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేశాడంట. కానీ మరోసారి లక్ష్మణ్‌తో చర్చలు జరిపేందుకు బోర్డు పెద్దలు సిద్దమైనట్లు సమాచారం. 

గంభీర్ మెడపై కత్తి..
కాగా వన్డే ప్రపంచకప్‌-2027 ముగిసే వర​కు బీసీసీఐతో గంభీర్ కాంట్రాక్ట్ ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన బట్టి అతడి కాంట్రాక్ట్‌ను బోర్డు పునః సమీక్షించే అవకాశముంది. గంభీర్ కోచింగ్‌లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది.

గంభీర్‌ ముందు పొట్టి ప్రపంచకప్‌తో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ 2025-27లో టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం. మిగిలిన మ్యాచ్‌లలో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత క్రికెట్‌ జట్టుకు మరో ఎనిమిది నెలల వరకు ఎటువంటి టెస్టు సిరీస్‌లు లేవు.
చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. శుభ్‌మన్‌ గిల్‌ కీలక నిర్ణయం
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)