Breaking News

బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌, ఇషాన్‌.. కొత్తగా నితీశ్‌కు చోటు

Published on Mon, 04/21/2025 - 12:07

2024-25 సంవత్సరానికి గానూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) తమ వార్షిక సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను (34 మంది) విడుదల చేసింది. భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా తమ ఏ ప్లస్‌ కేటగిరీని రీటైన్‌ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్‌ కోల్పోయిన శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ కాంట్రాక్ట్‌ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 

శ్రేయస్‌ బి కేటగిరీలో, ఇషాన్‌ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ ‍కుమార్‌ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌, యువ పేసర్‌ హర్షిత్‌ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందారు.

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్‌ కింద విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.

గ్రేడ్‌-ఏలో సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా, షమీ, రిషబ్‌ పంత్‌ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.

గ్రేడ్‌-బిలో సూర్యకుమార్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.

గ్రేడ్‌-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.

ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్‌ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్

ఈ ఏడాది కాంట్రాక్ట్‌ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్‌ భరత్, అవేష్ ఖాన్

ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్‌ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)

రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్‌ అశ్విన్ (కేటగిర ఏ నుంచి ఔట్‌)

 

 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు