నేడు ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌.. హార్దిక్‌ పాండ్యా X అభిషేక్‌ శర్మ 

Published on Tue, 12/02/2025 - 00:29

సాక్షి, హైదరాబాద్‌: భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎట్టకేలకు మ్యాచ్‌ బరిలోకి దిగుతున్నాడు. దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా నేడు పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో బరోడా తరఫున హార్దిక్‌ ఆడనున్నాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి ఈ మ్యాచ్‌ జరుగుతుంది. దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్‌ టి20 టోర్నీలో గాయపడిన హార్దిక్‌ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. 

సెప్టెంబర్‌ 26న అతను చివరిసారిగా మ్యాచ్‌ (శ్రీలంకతో) ఆడాడు. ఈ మ్యాచ్‌లో కండరాల గాయంతో తప్పుకున్న పాండ్యా కొంత విశ్రాంతి తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)కు చేరుకున్నాడు. అక్టోబర్‌ 15 నుంచి మధ్యలో మూడు రోజుల దీపావళి సెలవు మినహా నవంబర్‌ 29 వరకు అక్కడే ఉండి పూర్తిగా కోలుకునే వరకు రీహాబిలిటేషన్‌ కొనసాగించాడు. మ్యాచ్‌ ఆడేందుకు పాండ్యా సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. 

హార్దిక్‌ ఇప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ చేసేందుకు మ్యాచ్‌ ఫిట్‌గా మారాడని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) సర్టిఫికెట్‌ ఇచ్చింది. ‘దాదాపు నలభై రోజుల పాటు సీఓఈ బయటకు కూడా పోకుండా పాండ్యా పూర్తి స్థాయి రీహాబిలిటేషన్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను రిటర్న్‌ టు ప్లే ప్రోటోకాల్స్‌ను అన్ని విధాలా పాటించాడు. ఇప్పుడు మ్యాచ్‌ ఆడటమే మిగిలింది’ అని సీఓఈ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.  

ప్రజ్ఞాన్‌ ఓజా సమక్షంలో... 
నిజానికి ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం పాండ్యా డిసెంబర్‌ 4న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. అయితే బీసీసీఐ సెలక్టర్, హైదరాబాద్‌కే చెందిన ప్రజ్ఞాన్‌ ఓజా ముస్తాక్‌ అలీ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కనీసం రెండు మ్యాచ్‌లలో హార్దిక్‌ ఆట, ఫిట్‌నెస్‌ను పరీక్షించాలని సెలక్టర్లు భావించారు. దాంతో నేడు, గురువారం జరిగే రెండు మ్యాచ్‌లు హార్దిక్‌ ఆడతాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కోసం జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో అతని ప్రదర్శన కీలకం కానుంది.  

అభిషేక్‌ మళ్లీ చెలరేగేనా! 
భారత ఆటగాడు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ సభ్యుడు అభిషేక్‌ శర్మ మరోసారి తన టి20 మెరుపులను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం జింఖానా మైదానంలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 16 సిక్స్‌లతో 148 పరుగులు బాదిన అభిషేక్‌ ఇప్పుడు తనకు అచ్చొచ్చిన ఉప్పల్‌ మైదానంలో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గత పోరులో 12 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్న అతను 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. హార్దిక్, కెపె్టన్‌ కృనాల్‌ పాండ్యా మినహా పెద్ద అనుభవం లేని బరోడా బౌలింగ్‌ అతడిని ఏమాత్రం నిలువరించగలదో చూడాలి.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)