Breaking News

T20 WC 2026: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్‌

Published on Mon, 01/26/2026 - 08:50

టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి తమ జట్టును తప్పించడంపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) సవాలు చేయబోవడం లేదు. ఈ మేరకు బీసీబీ మీడియా కమిటీ చైర్మన్‌ అంజాద్‌ హుస్సేన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 

డీఆర్‌సీని సంప్రదించినా..
వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) బంగ్లాదేశ్‌ను తప్పించింది. బంగ్లాదేశ్‌ స్థానంలో ర్యాంకింగ్స్‌ ఆధారంగా స్కాట్లాండ్‌ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై బంగ్లా బోర్డు ఐసీసీ వివాద పరిష్కారాల కమిటీ (డీఆర్‌సీ)ని సంప్రదించినా ఫలితం లేకపోయింది. 

అంగీకరిస్తున్నాం
ఈ క్రమంలో కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్‌ (CAS)కు వెళ్లాలని ముందు అనుకున్న బీసీబీ... ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు విరమించుకుంది. ‘ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. ముందు నుంచి భారత్‌లో ఆడబోమని చెబుతూనే ఉన్నాం. అయినా మా వాదన వినిపించుకోలేదు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లే ఉద్దేశం లేదు’ అని అంజాద్‌ అన్నారు. 

ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నామని... ఇది తమ ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. ‘ఐసీసీ బోర్డు మీటింగ్‌ జరిగిన తర్వాత మంత్రివర్గ భేటీలో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల కోసం భారత్‌లో పర్యటించే అంశంపై చర్చ జరిగింది. భారత్‌లో ఆడేందుకు క్యాబినెట్‌ అంగీకరించలేదు. అదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాం’ అని అంజాద్‌ వివరించారు. 
ICC vs Bangladesh: అసలేం జరిగింది.. కథనాల కోసం క్లిక్‌ చేయండి  

చదవండి: హరీస్‌ రవూఫ్‌పై వేటు

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)