Breaking News

లంక బౌలర్‌ సంచలనం.. బాబర్‌ ఆజం వీక్‌నెస్‌ తెలిసినోడు

Published on Wed, 07/26/2023 - 13:10

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్‌ పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట వర్షార్పణం అయినప్పటికి మూడోరోజు మాత్రం దాటిగా ఆడుతూ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ సెంచరీతో రాణించగా.. సాద్‌ షకీల్‌ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ మూడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. 115 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఈ విషయం పక్కనబెడితే.. ఒక మ్యాచ్‌లో ఎంత బాగా బ్యాటింగ్‌ చేసినా అతని వీక్‌నెస్‌ తెలిసిన బౌలర్‌ ప్రత్యర్థి జట్టులో కచ్చితంగా ఒకడు ఉంటాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మరోసారి లంక బౌలర్‌ ప్రభాత్‌ జయసూరియాకు చిక్కాడు. టెస్టు క్రికెట్‌లో బాబర్‌ ఆజం ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లో ఔటవ్వడం ఇది ఆరోసారి.

39 పరుగులు చేసిన బాబర్‌ జయసూరియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. బాబర్‌ ఆజంను ఎక్కువసార్లు ఔట్‌ చేసిన బౌలర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌(ఆరుసార్లు, 133 బంతులు)తో కలిసి జయసూరియా(ఆరుసార్లు, 324 బంతులు) సంయుక్తంగా ఉన్నాడు. వీరిద్దరి తర్వాత ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ (ఐదుసార్లు, 443 బంతులు) బాబర్‌ ఆజం వికెట్‌ దక్కించుకున్నాడు. 

చదవండి: సిక్స్‌ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు.. ఎలాగో చూడండి..!

Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్‌ ఓపెనర్‌.. భారీ ఆధిక్యం దిశగా

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు