Breaking News

'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్‌ అదిరిపోయే పంచ్‌

Published on Fri, 02/10/2023 - 21:56

నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా.. ఆస్ట్రేలియాపై పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. జడేజా (66 పరుగులు), అక్షర్‌ పటేల్‌(52 పరుగులు)లు క్రీజులో ఉన్నారు. 144 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా మూడోరోజు ఆటలో 200 పరుగుల ఆధిక్యం సాధిస్తే మ్యాచ్‌పై పట్టు సాధించినట్లే. అంతకముందు రోహిత్‌ శర్మ అద్భుత శతకంతో అలరించాడు. 

రెండోరోజు ముగిసిన తర్వాత అక్షర్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా మీడియాకు అదిరిపోయే పంచ్‌ ఇచ్చాడు. నాగ్‌పూర్‌ పిచ్‌పై ఆసీస్‌ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించడంపై స్పందించిన అక్షర్‌.. '' మేం రేపు పొద్దున బ్యాటింగ్‌ చేసేవరకు పిచ్‌ మాకు అనుకూలంగానే ఉంటుంది.. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చేసరికి ఏదో ఒక దారి వెతుక్కుంటాం'' అని నవ్వుతూ పేర్కొన్నాడు. 

ఆ తర్వాత అక్షర్‌ మాట్లాడుతూ..'' ఇక మ్యాచ్‌లో అనవసర ఒత్తిడికి గురి కాకుండా స్ట్రైక్‌ రొటేషన్‌ మీద ఫోకస్‌ చేయమని జడేజా సూచనలు ఇచ్చాడు. అదే పాటించాను పరుగులు రాబట్టాను. ఇక ఏడాది నుంచి నా బ్యాటింగ్‌లో మార్పు వచ్చింది.  బ్యాటింగ్‌లో టెక్నిక్‌ పరంగా చాలా కాన్ఫిడెన్స్‌ ఉంది. బ్రేక్‌ దొరికిన సమయంలో దానిని మెరుగుపరుచుకున్నా. కోచింగ్‌ స్టాఫ్‌ వద్ద మరిన్ని మెళుకువలు నేర్చుకొని ఎబిలిటీ పెంచుకున్నా.  ఇది కొనసాగించడానికి ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: దిగ్గజ ఆల్‌రౌండర్‌ రికార్డు బద్దలు కొట్టిన జడేజా

ఆసీస్‌ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్‌ తొక్కేశారు

Videos

అదే జరిగితే టీడీపీ క్లోజ్..!

పవన్ సీజ్ ద షిప్ పై జగన్ మాస్ ర్యాగింగ్..

రసవత్తరంగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు

నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)