ఆసీస్ క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. ఇకపై ‘నా’ దేశానికి ఆడతా!

Published on Thu, 07/16/2026 - 11:07

ఆస్ట్రేలియా వెటరన్‌ క్రికెటర్‌ మోజెస్‌ హెన్రిక్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌తో పాటు ఆసీస్‌ దేశవాళీ క్రికెట్‌కూ వీడ్కోలు పలికాడు. కాగా 2009 -2021 మధ్య హెన్రిక్స్‌ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు.

ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 164, వన్డేల్లో 117, టీ20లలో 355 పరుగులు సాధించిన మోజెస్‌ హెన్రిక్స్‌.. ఆయా ఫార్మాట్లలో వరుసగా రెండు, ఎనిమిది, ఏడు వికెట్లు కూల్చాడు.

ఐపీఎల్‌లోనూ..
ఇక ఐపీఎల్‌లో 62 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్‌.. 1000 పరుగులు చేయడంతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా 2021లో ఆసీస్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన హెన్రిక్స్‌.. బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌), దేశీ క్రికెట్లో యాక్టివ్‌గా ఉన్నాడు. బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫున కీలకంగా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్‌.. దేశవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్‌ వేల్స్‌కు ఆడుతున్నాడు.

పోర్చుగల్‌లో జన్మించి..
అయితే, టీ20 ప్రపంచకప్‌-2028 టోర్నీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి కొత్త ఫార్మాట్‌ రూపొందించిన తరుణంలో మోజెస్‌ హెన్రిక్స్‌ ఆసీస్‌ క్రికెట్‌ నుంచి పూర్తిస్థాయిలో తప్పుకోవడం గమనార్హం. కాగా మోజెస్‌ హెన్రిక్స్‌ పోర్చుగల్‌లో జన్మించాడు. ఆ తర్వాత క్రికెట్‌ కెరీర్‌ కోసం ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు.

ఇక ఇప్పుడు తన సొంత దేశం పోర్చుగల్‌ తరఫున క్రికెట్‌ ఆడాలని మోజెస్‌ హెన్రిక్స్‌ నిర్ణయించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2028లో భాగంగా యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ పోటీల్లో పోర్చుగల్‌ తరఫున అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఈ టోర్నీపై దృష్టి సారించేందుకు 39 ఏళ్ల హెన్రిక్స్‌ ఆసీస్‌ క్రికెట్‌కు దూరమైనట్లు తెలుస్తోంది.

పరుగుల వరద.. వికెట్ల వీరుడు
ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్‌ జట్టు తరఫున 2006లో అరంగేట్రం చేశాడు మోజెస్‌ హెన్రిక్స్‌. అదే ఏడాది లిస్ట్‌-ఎ క్రికెట్‌లోనూ అడుగుపెట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

మొత్తంగా 131 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 141 లిస్‌​-ఎ మ్యాచ్‌లు, 301 టీ20 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్‌.. 6830, 3812, 5747 పరుగులు సాధించాడు. మీడియం పేసర్‌ అయిన అతడు మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 333 వికెట్లు కూల్చాడు. ఇక బీబీఎల్‌లో 3324 పరుగులు సాధించడంతో పాటు.. సిడ్నీ సిక్సర్స్‌ కెప్టెన్‌గా 2019, 2020లో టైటిల్‌ అందించాడు.

చదవండి: ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌గా అశ్విన్‌?

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)