Breaking News

భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్‌

Published on Sun, 10/05/2025 - 17:58

కాన్పూర్‌ వేదికగా భారత్‌-ఏతో (India-A) ఇవాళ (అక్టోబర్‌ 5) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ (Australia-A) భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కూపర్‌ కన్నోలీ (64), లియామ్‌ స్కాట్‌ (73), కెప్టెన్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డారు.

44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్‌ షా (32) సాయంతో ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్‌ స్కాట్‌, ఎడ్వర్డ్స్‌ సంచలన ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్‌ అందించారు. స్కాట్‌, ఎడ్వర్డ్స్‌ ఏడో వికెట్‌కు 152 పరుగులు జోడించి, భారత్‌కు కఠిన సవాల్‌ విసిరారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టార్‌ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (5) వరుసగా మూడో మ్యాచ్‌లో నిరాశపరిచాడు.

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించాడు. వీరిలో అర్షదీప్‌ సింగ్‌ (10-2-38-3) ఒక్కడే సామర్థ్యం మేరకు రాణించగా.. హర్షిత్‌ రాణా (9.1-0-61-3) వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 

పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ ఆయుశ్‌ బదోని 2 వికెట్లు తీయగా.. గుర్జప్నీత్‌ సింగ్‌, నిషాంత్‌ సంధు తలో వికెట్‌ దక్కించుకున్నారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ విప్రాజ్‌ నిగమ్‌కు (6-0-60-0) ఆసీస్‌ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. అభిషేక్‌ శర్మ (4-0-19-0) పర్వాలేదనిపించాడు.

కాగా, ఈ మ్యాచ్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచాయి. వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ కూడా జరిగింది. ఆ సిరీస్‌కు భారత్‌ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. 

చదవండి: World Cup 2025: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ముందు టాస్‌ గందరగోళం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)