Breaking News

ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌.. చెలరేగిన టీమిండియా యువ ప్లేయర్‌

Published on Tue, 09/23/2025 - 18:20

భారత్‌-ఏ, ఆస్ట్రేలియా-ఏ (India A vs Australia A) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇవాళ (సెప్టెంబర్‌ 23) నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ మొదలైంది. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారత-ఏ కెప్టెన్సీ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) తప్పుకున్నాడు. 

ఆటగాడిగానూ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో భారత మేనేజ్‌మెంట్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ధృవ్‌ జురెల్‌ను (Dhruv Jurel) కెప్టెన్‌గా నియమించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జురెల్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

రాణించిన మెక్‌స్వీనీ, జాక్‌ ఎడ్వర్డ్స్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. కెప్టెన్‌ నాథన్‌ మెక్‌స్వీనీ (74), జాక్‌ ఎడ్వర్డ్స్‌ (88) అర్ద సెంచరీలతో రాణించారు. 

స్టార్‌ ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌ (49) తృటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. వికెట్‌కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ (39) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి టాడ్‌ మర్ఫీ (29), హెన్రీ థార్న్టన్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు.

ఐదేసిన యువ స్పిన్నర్‌
భారత బౌలర్లలో యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (Manav Suthar) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 28 ఓవర్లలో 93 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సుతార్‌తో పాటు గుర్నూర్‌ బ్రార్‌ (13-0-71-2), ప్రసిద్ద్‌ కృష్ణ (13-3-63-1), మొహమ్మద్‌ సిరాజ్‌ (13-1-73-1) వికెట్లు తీశారు. 

నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఆయుశ్‌ బదోనికి వికెట్లు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి భారత్‌-ఏ తరఫున బరిలోకి దిగారు.

చదవండి: దిగ్గజ క్రికెట్‌ అంపైర్‌ హెరాల్డ్‌ డికీ బర్డ్‌ కన్నుమూత

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)