Breaking News

న్యూజిలాండ్‌పై సూపర్‌ విక్టరీ.. రెండో స్థానానికి ఎగబాకిన ఆస్ట్రేలియా

Published on Mon, 03/11/2024 - 14:59

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ గెలుపుతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. డబ్యూటీసీలో ప్రస్తుతం ఆసీస్‌ విజయాల శాతం 62.51గా ఉంది.

ప్రస్తుత డబ్యూటీసీ సైకిల్‌లో ఆసీస్‌ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 90 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆసీస్‌ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. ఆ జట్టు ప్రస్తుత డబ్లూటీసీ సైకిల్‌లో 50 శాతం విజయాలతో 36 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో టీమిండియా తమ విజయాల శాతాన్ని మరింత మెరుగుపర్చుకుని టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుంది. భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తర్వాత బంగ్లాదేశ్‌ (50 శాతం విజయాలు),  పాకిస్తాన్‌ (36.66), వెస్టిండీస్‌ (33.33), సౌతాఫ్రికా (25), ఇంగ్లండ్‌ (17.5) వరుస స్థానాల్లో ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, మిచెల్‌ మార్ష్‌ (80), అలెక్స్‌ క్యారీ (98 నాటౌట్‌), పాట్‌ కమిన్స్‌ (32 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను 3 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో 80 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయి ఓటమి కొరల్లో చిక్కుకున్న ఆసీస్‌ను ఈ ముగ్గురు కలిసి విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 162, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 372 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌటైన ఆసీస్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి, 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)