Breaking News

ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 రన్స్‌

Published on Sun, 11/09/2025 - 09:11

హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్న‌మెంట్‌లో ఆస్ట్రేలియా త‌మ జోరును కొన‌సాగిస్తోంది. శ‌నివారం మోంగ్‌కాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కంగారుల జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా  నిర్ణీత 6 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 149 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలుత ఓపెనర్ బెన్ మెక్‌డెర్మాట్ కేవలం 14 బంతుల్లో   8 సిక్స్‌ల సాయంతో  51 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 

సూపర్ సిక్సెస్ టోర్నీ నిబంధనల ప్రకారం 50 పరుగులు చేసిన బ్యాటర్ 'రిటైర్డ్ హర్ట్'గా వెళ్లాల్సి ఉంటుంది. ఇక మెక్‌డెర్మాట్‌తో పాటు కెప్టెన్ అలెక్స్ రాస్ 11 బంతుల్లో 7 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ ఏడాది సూపర్ సిక్సెస్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు 20 సిక్స్‌లు బాదారు.

తడబడిన బంగ్లా..
అనంతరం బంగ్లాదేశ్ 150 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున అబు హైదర్  ఒంటరి పోరాటం చేశాడు.  హైదర్ 18 బంతుల్లో 7 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో క్రిస్ గ్రీన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఆదివారం తలపడనుంది.
చదవండి: అత‌డు లేక‌పోవ‌డం కలిసొచ్చింది.. వారి వ‌ల్లే చెల‌రేగుతున్నాను: అభిషేక్‌

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)