Breaking News

మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్‌

Published on Sun, 06/14/2026 - 19:37

డిఫెండింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్స్‌, ఆరుసార్లు వన్డే ప్రపంచకప్‌ విన్నర్‌ అస్ట్రేలియా బంగ్లాదేశ్‌ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 14) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో అతికష్టం మీద వికెట్‌ తేడాతో గెలుపొందింది. 

ఫలితంగా బంగ్లాదేశ్‌ ఆధిపత్యాన్ని 1-2కు తగ్గించి, క్లీన్‌ స్వీప్‌ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఇదివరకే సిరీస్‌ను చేజార్చుకున్న ఆసీస్‌.. నేటి మ్యాచ్‌లోనూ మరో ఘోర పరాభవాన్ని తృటిలో తప్పించుకుంది.

275 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్‌ కన్నోల్లీ (149) సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్‌ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే గెలుపుకు అతి చేరువలో 5 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి, మరో ఘోర ఓటమికి చేరువైంది. 

నానా కష్టాలు పడ్డ అనంతరం చివరి ఓవర్‌ మూడో బంతికి ఆడమ్‌ జంపా (4 నాటౌట్‌) బౌండరీ సాధించి, ఆసీస్‌ను మరో ఘోర పరాభం నుంచి తప్పించడంతో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ అయ్యే అవమానం నుంచి కూడా గట్టెక్కించాడు. చివర్లో జంపాకు మెరిడిత్‌ (2 నాటౌట్‌) సహకరించాడు. 

ఫలితంగా ఆసీస్‌ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్‌ సెంచరీ అనంతరం కన్నోల్లీ గెలుపు వాకిట ఔటై ఆసీస్‌ శిబిరంలో ఉత్కంఠ రేపాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ .. తౌహిద్‌ హృదోయ్‌ (83), లిటన్‌ దాస్‌ (58 నాటౌట్‌), మొసద్దెక్‌ హొసేన్‌ (56 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 

ఆసీస్‌ బౌలర్లలో బార్ట్‌లెట్‌, రెన్షా తలో 2 వికెట్లతో రాణించారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కన్నోల్లీ ఒంటరిపోరాటం​ చేశాడు. అతడికి లబూషేన్‌ (29), గ్రీన్‌ (27), పీక్‌ (27) కాసేపు అండగా నిలబడ్డారు. గెలుపు ఖరారయ్యాక బంగ్లా బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో ఆసీస్‌ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. 

కాస్త అటుఇటు అయ్యుంటే ఈ మ్యాచ్‌ కూడా ఆసీస్‌ చేజారేది. షోరిఫుల్‌ ఇస్లాం (10-1-48-6) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆసీస్‌ శిబిరంలో రైళ్లు పరిగెట్టించాడు. ఈ పర్యటనలో ఆసీస్‌ తదుపరి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. తొలి మ్యాచ్‌ చట్టోగ్రామ్‌ వేదికగా జూన్‌ 17న జరుగనుంది. 
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)