Breaking News

రెండో వ‌న్డేలోనూ భార‌త్‌ ఓట‌మి.. సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్‌

Published on Fri, 10/09/2026 - 17:07

భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆస్ట్రేలియా-ఎ జ‌ట్టు మూడు మ్యాచ్‌ల అన‌ధికారిక వ‌న్డే సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0తో సొంతం చేసుకుంది. పాండిచ్చేరి వేదిక‌గా శుక్రవారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 69 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 49.5 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. 

ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (67), జోష్ ఫిలిప్ (58) అర్థసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ 3 వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు 45.2 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. రజత్ పాటీదార్ (67) అర్థసెంచరీ సాధించగా.. చివర్లో అనుకుల్ రాయ్ (34 నాటౌట్‌) ఒంటరిపోరాటం చేసినప్పటికీ మిగతావారి నుంచి సహకారం కరువయ్యింది. 

ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ 3 వికెట్లు తీయగా, రిలే మెరిడిత్‌, తన్వీర్ సంగాలు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే అక్టోబర్ 11న జరగనుంది. అంతకముందు జరిగిన రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో సొంతం చేసుకుంది.  బ్యాటింగ్‌లో ఏడు బంతుల్లో 14 ప‌రుగులు చేయ‌డంతో పాటు బౌలింగ్‌లో మూడు కీల‌క వికెట్లు తీసిన స్పెన్స‌ర్ జాన్స‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఇదీ చదవండి: టెస్టు క్రికెట్‌లో స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఫీట్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)