Breaking News

బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫిదా

Published on Sat, 09/24/2022 - 08:50

టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. గాయంతో సుధీర్ఘ కాలం జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20తో ఎంట్రీ ఇచ్చాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించడంతో బుమ్రాకు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. అయినప్పటికి బుమ్రా తన మార్క్‌ను చూపించాడు. 2 ఓవర్లు వేసిన బుమ్రా 23 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు.

అయితే ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ను ఔట్‌ చేసిన తీరు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  బుమ్రా వేసిన యార్కర్‌కు  15 బంతుల్లో 31 పరుగులతో ధాటిగా ఆడుతున్న ఫించ్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. బుమ్రాను ఎందుకు యార్కర్ల కింగ్‌గా పిలుస్తారో ఫించ్‌కు వేసిన డెలివరీని చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ అయినా ఫించ్‌ బుమ్రాను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. పెవిలియన్ వెళ్తూ ''సూపర్‌ డెలివరీ'' అన్న తరహాలో తన బ్యాట్‌ను చేతితో కొట్టిన ఫించ్‌ అతన్ని అభినందించాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక బుమ్రా కమ్‌బ్యాక్‌ను టీమిండియా ఫ్యాన్స్‌ పండుగలా జరుపుకున్నారు. ''బూమ్‌ బూమ్‌ బుమ్రా ఈజ్‌ బ్యాక్‌.. బుమ్రా వచ్చాడు టీమిండియా గెలిచింది.. అందుకే నిన్ను యార్కర్ల కింగ్‌ అనేది'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: 'నేనే సర్‌ప్రైజ్‌ అయ్యా.. అందుకే డీకే పంత్‌ కంటే ముందుగా'

Videos

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)