Breaking News

‘రొనాల్డోనే స్ఫూర్తి.. నా తండ్రి కూడా అలానే మరణించాడు’

Published on Tue, 08/04/2026 - 15:26

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో జూడో గేమ్‌లో మ‌హిళ‌ల విభాగంలో స్వ‌ర్ణం సాధించిన తొలి క్రీడాకారిణిగా అస్మితా దే చ‌రిత్ర సృష్టించింది. 48 కేజీల విభాగంలో కెన‌డాకు చెందిన హిడీ క్వాచ్‌ను ఓడించి ప‌డిసి ప‌త‌కం అంద‌కుంది. అయితే త‌న జీవితంపై ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్ర‌భావం బ‌లంగా ఉంద‌ని అస్మితా దే స్ప‌ష్టం చేసింది. జీవితంలో ఇష్ట‌మైన వాళ్ల‌ను కోల్పోతే ఆ బాధ‌ను ఎలా దిగమింగాలన్న విష‌యాన్ని రొనాల్డో నుంచే నేర్చుకున్న‌ట్లు అస్మితా తెలిపింది.

నేను ఎక్కువ‌గా ఆరాధించే వ్య‌క్తి క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డో త‌న జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాడు. అత‌డు త‌న 19వ ఏట తండ్రిని కోల్పోయిన‌ప్ప‌టికీ, ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ఆట‌గాడిగా ఎదిగాడు. ఇవాళ రొనాల్డో ఎవ‌ర‌నేది ప్ర‌పంచానికి మొత్తం తెలుసు. అత‌డి జీవితాన్ని పూర్తిగా చ‌దివాను. అందుకే రొనాల్డో నాకు అత్యంత స్ఫూర్తినిచ్చే వ్య‌క్తి* అని చెప్పుకొచ్చింది.

ఇక అస్మితా దే జీవిత ప్ర‌యాణం కూడా క‌ష్టాల నుంచే మొద‌ల‌య్యింది. త్రిపుర‌లో ద‌క్షిణ ప్రాంత‌మైన బెలోనియాలో జ‌న్మించిన అస్మితా ఆర్థిక క‌ష్టాలు ఎదుర్కొన్న ఇంట్లో పుట్టింది. అస్మితా తండ్రి అర్జున్ దే త్రిపుర‌లో సైకిల్ మెకానిక్‌గా ప‌నిచేస్తూ రోజుకు రూ. 300 సంపాదించేవాడు. అయితే చిన్న‌ప్ప‌టి నుంచే ఆట‌ల‌పై కూతురు పెంచుకున్న ఇష్టాన్ని చూసిన తండ్రి తాను సంపాదించే ప్ర‌తి రూపాయిని పొదుపుగా ఖ‌ర్చు చేసేవారు. 

ఆ త‌ర్వాత అస్మితా భోపాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరి జోడోలో మ‌రింత ప‌ట్టు సాధించింది. ఈ నేప‌థ్యంలోనే స్పోర్ట్స్ కోటాలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ పోలీసు విభాగంలో ఉద్యోగం ల‌భించ‌డంతో ఆర్థిక క‌ష్టాలు కొంత‌మేర త‌గ్గాయి. అయితే ఆర్థిక క‌ష్టాలు త‌గ్గిన‌ప్ప‌టికీ, కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు అర్హ‌త సాధించడానికి కొన్ని రోజుల ముందే అస్మితా తండ్రి అర్జున్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మ‌ర‌ణించారు. 

తండ్రి మ‌ర‌ణంతో షాక్‌లో ఉండిపోయిన అస్మితా తాను పోటీల్లో పాల్గొన‌గ‌ల‌నా అనే సందేహం వ‌చ్చింది. కానీ అస్మితా త‌ల్లి అనుక్ష‌ణం ఆమె వెంటే నిలిచి తండ్రి క‌ల‌ను నెర‌వేర్చాల‌ని గుర్తు చేస్తూ ప్రోత్స‌హించింది. తండ్రి పోయిన బాధ‌ను దిగ‌మింగుకొని కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు పుట్టెడు దుఃఖంతో వెళ్లిన అస్మితా దే తండ్రి క‌ల‌ను నిజం చేస్తూ ఇవాళ స్వ‌ర్ణ ప‌త‌కంతో దేశానికి తిరిగి వ‌చ్చింది.

చదవండి: విషాదం.. గుండెపోటుతో కన్నుమూసిన బ్రెజిల్‌ ఆటగాడు

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)