Breaking News

కొనసాగుతున్న ఆసియా కప్‌ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ

Published on Tue, 09/30/2025 - 11:42

ఆసియా కప్‌ 2025 (Asia cup 2025) హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ ముగిసి రెండు రోజులైనా ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు (Team India) విన్నింగ్‌ ట్రోఫీ అందలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీద నుంచి విన్నింగ్‌ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే. 

దీనికి ప్రతిగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇ‍వ్వాల్సిన మెడల్స్‌ను తీసుకెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకున్నా గెలుపు సంబురాలు అద్భుతంగా చేసుకున్నారు.

తాజాగా నఖ్వీ తాను ఎత్తుకెళ్లి పోయిన ట్రోఫీని, మెడల్స్‌ను భారత ఆటగాళ్లకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు ఓ కండీషన్‌ పెట్టాడట. అతనే స్వయంగా భారత కెప్టెన్‌కు ట్రోఫీని, మిగతా ఆటగాళ్లకు మెడల్స్‌ను ఇస్తానని చెప్పాడట. నఖ్వీ పెట్టిన ఈ కండీషన్‌కు భారత ఆటగాళ్లు ససేమిరా అన్నట్లు సమాచారం. 

ఈ వివాదం అతి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ (సెప్టెంబర్‌ 30) జరుగబోయే ఏసీసీ సమావేశంలో బీసీసీఐ నఖ్వీని తూర్పారబెట్టాలని డిసైడైంది. ఇది అతని పదవికే ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఈ వివాదాన్ని బీసీసీఐ ఐసీసీ వరకు కూడా తీసుకెళ్లకుండా ఏసీసీలోనే తెంచేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా, సెప్టెంబర్‌ 28న జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్‌ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్‌ (24), శివమ్‌ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్‌ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.

ఈ టోర్నీలో భారత్‌ మొత్తం మూడు సార్లు పాక్‌ను ఓడించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌ను నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పీసీబీ నానా యాగీ చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

తమకు అనుకూలంగా ఏదీ జరగడం లేదని తెలిసి పీసీబీ వారి ఆటగాళ్లను రెచ్చగొట్టింది. భారత్‌ను, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పాక్‌ ఆటగాళ్లు హరీస్‌ రౌఫ్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్‌ చాలా ఓవరాక్షన్‌ చేశారు. దీనికి కూడా పాక్‌ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. పాక్‌ ఆటగాళ్ల కవ్వింపులకు ఎక్కడా సహనం కోల్పోని  టీమిండియా మైదానంలో వారికి తగు రీతో బద్ది చెప్పింది.

చదవండి: ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన

 

 

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు