Breaking News

Asia Cup 2025: రాణించిన సంజూ.. ఒమన్‌పై టీమిండియా విజయం

Published on Sat, 09/20/2025 - 00:02

ఆసియా కప్‌-2025లో భాగంగా సెప్టెంబర్‌ 19న జరిగిన నామమాత్రపు మ్యాచ​్‌లో పసికూన ఒమన్‌పై భారత్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

సంజూ శాంసన్‌ (56) అర్ద సెంచరీతో రాణించగా..  అభిషేక్‌ శర్మ (38), అక్షర్‌ పటేల్‌ (26), తిలక్‌ వర్మ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్‌ బౌలర్లలో షా ఫైసల్‌ (4-1-23-2), జితేన్‌ రామనంది (4-0-33-2), ఆమిర్‌ కలీమ్‌ (3-0-31-2) వికెట్లు తీశారు.  

అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగనప్పటికీ.. భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని శభాష్‌ అనిపించుకుంది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు  కోల్పోయి 167 పరుగులు చేసింది.

ఓపెనర్‌ ఆమిర్‌ కలీమ్‌ (64), వన్‌ డౌన్‌లో వచ్చిన హమ్మద్‌ మీర్జా (51) అద్బుతమైన అర్ద సెంచరీలతో టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మరో ఓపెనర్‌, ఒమన్‌ కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ (32) కూడా పర్వాలేదనిపించారు.

ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా భారత్‌ సూపర్‌-4కు అర్హత సాధించగా.. ఒమన్‌ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. సూపర్‌-4 దశలో భారత్‌ సెప్టెంబర్‌ 21న పాకిస్తాన్‌తో తలపడుతుంది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)