Breaking News

కోహ్లి రికార్డు బ్రేక్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా

Published on Sun, 09/14/2025 - 20:59

ఆసియా కప్‌-2025 (Asia Cup)లో భాగంగా టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా పాకిస్తాన్‌కు ఆదిలోనే షాకిచ్చాడు. భారత బౌలింగ్‌ అటాక్‌ను ఆరంభించిన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ తొలి బంతిని వైడ్‌గా సంధించాడు. అయితే, ఆ తర్వాత వెంటనే వికెట్‌ తీసి టీమిండియాకు శుభారంభం అ​​ందించాడు.

హార్దిక్‌ వేసిన అవుట్‌స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన పాక్‌ ఓపెనర్‌ సయీమ్‌ ఆయుబ్‌.. బంతిని గాల్లోకి లేపగా జస్‌ప్రీత్‌ బుమ్రా క్యాచ్‌ పట్టాడు. దీంతో ఆయుబ్‌ డకౌట్‌ అయ్యాడు. ఫలితంగా పాక్‌ తొలి వికెట్‌ కోల్పోగా.. హార్దిక్‌ ఖాతాలో తొలి వికెట్‌ చేరింది.

పాండ్యా సూపర్‌ క్యాచ్‌
ఇక ఆ మరుసటి ఓవర్లో హార్దిక్‌ పాండ్యా మంచి క్యాచ్‌ అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ మహ్మద్‌ హ్యారిస్‌ (3) ఇచ్చిన క్యాచ్‌ను పాండ్యా కష్టపడి పట్టాడు. బ్యాట్‌ టాప్‌ ఎడ్జ్‌ను తాకిన బంతి గాల్లోకి లేవగా లాంగ్‌ లెగ్‌లో నుంచి పరిగెత్తుకుని వచ్చి మరీ అందుకున్నాడు. ఫలితంగా పాక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.  

ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా.. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లిని అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో భారత ఫీల్డర్‌గా నిలిచాడు. రోహిత్‌ శర్మ 65 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్‌ పాండ్యా.. మహ్మద్‌ హ్యారిస్‌ క్యాచ్‌తో కలిపి 55 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.  

ఇదిలా ఉంటే.. దుబాయ్‌ వేదికగా ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో భారత్‌- పాక్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పది ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్లు
రోహిత్‌ శర్మ- 65
హార్దిక్‌ పాండ్యా- 55*
విరాట్‌ కోహ్లి- 54
సూర్యకుమార్‌ యాదవ్‌- 51*
సురేశ్‌ రైనా- 42. 

చదవండి: టీమిండియా కెప్టెన్‌గా తిల‌క్ వ‌ర్మ‌.. బీసీసీఐ ప్ర‌కట‌న‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)