Breaking News

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌

Published on Tue, 09/30/2025 - 11:03

టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్ (Sanju Samson) చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా అవతరించాడు. తాజాగా జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో సంజూ ఈ ఘనత సాధించాడు. ఎంఎస్‌ ధోని (MS Dhoni) పేరిట ఉండిన ఈ రికార్డును సంజూ తన పేరిట బదిలి చేసుకున్నాడు.

పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో (Asia Cup 2025) సంజూ ఓ సిక్సర్‌ కొట్టాడు. దీంతో కలుపుకొని టీ20ల్లో అతని సిక్సర్ల సంఖ్య 55కి చేరింది. కేవలం 48 ఇన్నింగ్స్‌ల్లోనే సంజూ ఈ సిక్సర్లను బాదాడు. ధోని విషయానికొస్తే.. అతని ఖాతాలో 54 టీ20 సిక్సర్లు ఉన్నాయి. ఈ విభాగంలో సంజూ, ధోని తర్వాతి స్థానంలో రిషబ్‌ పంత్‌ ఉన్నాడు. పంత్‌ ఖాతాలో 52 సిక్సర్లు ఉన్నాయి.

ఆసియా కప్‌లో సంజూ మరో ఘనత కూడా సాధించాడు. ఓ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 7 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ధోని, పంత్‌ పేరిట సంయుక్తంగా ఉంది. ధోని 2009 టీ20 వరల్డ్‌కప్‌లో, పంత్‌ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో తలో 6 సిక్సర్లు బాదారు.

కాగా, ఆసియా కప్‌ 2025లో భారత్‌ విజేతగా అవతరించింది. ఫైనల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్‌ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్‌ (24), శివమ్‌ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్‌ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ టోర్నీలో భారత్‌ మొత్తం మూడు సార్లు పాక్‌ను ఓడించింది. 

చదవండి: ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)