Breaking News

అస్సలు ఊహించలేదు.. కలలా ఉంది! పెద్ద మనసు చాటుకున్న సిరాజ్‌

Published on Sun, 09/17/2023 - 19:08

Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ‘‘అంతా ఓ కలలా అనిపిస్తోంది. గతంలో త్రివేండ్రంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగింది. ఆరంభంలోనే నాలుగు వికెట్లు పడగొట్టాను. ఐదు వికెట్ల హాల్‌ నమోదు చేయలేకపోయాను. అయినా.. మన విధిరాతలో ఇలా జరగాలని రాసి ఉన్నపుడు కచ్చితంగా జరిగే తీరుతుందని నాకిప్పుడు అర్థమైంది.

నమ్మలేకపోయాను
నిజానికి ఈరోజు ఆరంభంలోనే వికెట్లు తీయడానికి నేను పెద్దగా ప్రయత్నించలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నేను ఎల్లప్పుడూ స్వింగ్‌ కోసమే చూస్తూ ఉంటా. గత మ్యాచ్‌లలో అస్సలు ఇలా లేదు. ఈరోజు మాత్రం బాల్‌ ఫుల్‌గా స్వింగ్‌ అయింది. అసలు నేనే నమ్మలేకపోయాను. 

అవుట్‌ స్వింగర్లు సంధించి ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాను. బ్యాటర్లు ముందుకు వచ్చి ఆడేలా ట్రాప్‌ చేసి విజయవంతమయ్యాను. చాలా సంతోషంగా ఉంది’’ అని టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌-2023 ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ బౌలర్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే.

సిరాజ్‌ దెబ్బకు పెవిలియన్‌కు క్యూ
కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లతో విజృంభించిన సిరాజ్‌ మియా.. మొత్తంగా 7 ఓవర్ల బౌలింగ్‌లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు.

సిరాజ్‌ దెబ్బకు శ్రీలంక టాపార్డర్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక(2) సహా కుశాల్‌ మెండిస్‌(17), సమరవిక్రమ(0), చరిత్‌ అసలంక(0), ధనుంజయ డి సిల్వ(4), దసున్‌ షనక(0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక జస్‌ప్రీత్‌ బుమ్రా ఓపెనర్‌ కుశాల్‌ పెరీరాను డకౌట్‌ చేయగా.. హార్దిక్‌ పాండ్యా దునిత్‌ వెల్లలగే(8), ప్రమోద్‌ మదుషాన్‌(1), మతీశ పతిరణ(0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 15.2 ఓవర్లలో 50 పరుగులకే లంక ఆలౌట్‌ అయింది.

లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ 23, శుబ్‌మన్‌ గిల్‌ 27 పరుగులతో అదరగొట్టి 6.1 ఓవర్లలోనే విజయ లాంఛనం పూర్తి చేశారు. దీంతో టీమిండియా ఎనిమిదో సారి ఆసియా కప్‌ విజేతగా అవతరించింది.

పెద్ద మనసు చాటుకున్న సిరాజ్‌
ఇక విజయానంతరం ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మహ్మద్‌ సిరాజ్‌ మాట్లాడుతూ.. తన ప్రణాళికలను పక్కాగా అమలు చేశానన్నాడు. బుమ్రా, పాండ్యాల నుంచి సహకారం అందిందని.. సమిష్టిగా రాణించి జట్టుకు విజయం అందించామని పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా.. తనకు లభించిన ప్రైజ్‌మనీని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద చాటుకున్నాడు సిరాజ్‌. కాగా కొలంబోలో వర్షాల నేపథ్యంలోనూ సిబ్బంది ఎప్పటికప్పుడు మ్యాచ్‌ సజావుగా సాగేలా శ్రమించిన విషయం తెలిసిందే. దీంతో వారి పట్ల ఈ విధంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు సిరాజ్‌.

చదవండి: ఏంటా బౌలింగ్‌ సామి! సిరాజ్‌ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్‌ మనదే

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)