Breaking News

Asia Cup 2023: పసికూనపై ప్రతాపం.. ఐదో వేగవంతమైన సెంచరీ

Published on Wed, 08/30/2023 - 20:48

ఆసియా కప్‌ 2023లో భాగంగా ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 30) జరుగుతున్న మ్యాచ్‌లో పాక్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ విధ్వంసకర శతకంతో (71 బంతుల్లో 109 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికార్‌.. కేవలం 67 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి, వన్డేల్లో పాక్‌ తరఫున ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా బాసిత్‌ అలీ (67 బంతుల్లో) రికార్డును సమం చేశాడు.

వన్డేల్లో పాక్‌ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు షాహిద్‌ అఫ్రిది (37 బంతుల్లో) పేరిట ఉంది. ఆతర్వాత రెండు (45), మూడు (53) ఫాస్టెస్ట్‌ హండ్రెడ్స్‌ రికార్డులు కూడా అతని ఖాతాలోనే ఉన్నాయి. పాక్‌ తరఫున వన్డేల్లో నాలుగో వేగవంతమైన శతకం షర్జీల్‌ ఖాన్‌ (61) పేరిట ఉంది. 

ఇదిలా ఉంటే, ఇఫ్తికార్‌తో పాటు బాబర్‌ ఆజమ్‌ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా రికార్డు శతకంతో కదంతొక్కడంతో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ భారీ స్కోర్‌ (342/6) చేసింది. 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేసిన బాబర్‌.. కెరీర్‌లో 19వ శతకాన్ని నమోదు చేసి, వన్డేల్లో అత్యంత వేగంగా (102 ఇన్నింగ్స్‌ల్లో) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 

అలాగే ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన కెప్టెన్‌గా (151), వన్డేల్లో డేవిడ్‌ వార్నర్‌ సెంచరీల రికార్డును (19) సమం చేసిన ఆటగాడిగా, సయీద్‌ అన్వర్‌ (20) తర్వాత పాక్‌ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకాడు. 


 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)