Breaking News

Asia Cup 2023: శతక్కొట్టిన బాబర్‌, ఇఫ్తికార్‌.. పాక్‌ భారీ స్కోర్‌ 

Published on Wed, 08/30/2023 - 19:11

ఆసియా కప్‌ 2023లో భాగంగా ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 30) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు శతకంతో కదంతొక్కగా.. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికార్‌ అహ్మద్‌ సుడిగాలి శతకంతో (71 బంతుల్లో 109 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

పాక్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ 44 పరుగులతో పర్వాలేదనిపించగా.. ఫకర్‌ జమాన్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (5), అఘా సల్మాన్‌ (5) విఫలమయ్యారు. నేపాల్‌ బౌలర్లలో సోంపాల్‌ కామీ 2 వికెట్లు పడగొట్టగా.. కరణ్‌ , సందీప్‌ లామిచ్చేన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఇమామ్‌ ఉల్‌ హాక్‌, రిజ్వాన్‌ రనౌట్లయ్యారు. 

బాబర్‌ రికార్డు శతకం.. 
ఈ మ్యాచ్‌లో 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేసిన బాబర్‌.. కెరీర్‌లో 19వ శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా (102 ఇన్నింగ్స్‌ల్లో) 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే డేవిడ్‌ వార్నర్‌ సెంచరీల రికార్డును (19) సమం చేసి, సయీద్‌ అన్వర్‌ (20) తర్వాత పాక్‌ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

ఇఫ్తికార్‌ సుడిగాలి శతకం..
నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్‌ భారీ స్కోర్‌ సాధించడంతో కీలకంగా వ్యవహరించిన ఇఫ్తికార్‌ అహ్మద్‌ వన్డే కెరీర్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. ఇఫ్తికార్‌ కేవలం 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 

Videos

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

Photos

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)