Breaking News

IND VS SL: అరుదైన ఘనత సాధించిన రోహిత్‌ శర్మ.. సిక్సర్‌తో..!

Published on Tue, 09/12/2023 - 15:45

ఆసియా కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్‌ 12) జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో 10000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైల్‌స్టోన్‌ను హిట్‌మ్యాన్‌ సిక్సర్‌ (285) బాది చేరుకోవడం విశేషం. వన్డే కెరీర్‌లో 241వ ఇన్నింగ్స్‌ ఆడుతున్న రోహిత్‌.. 22 పరుగుల మార్కును దాటిన తర్వాత 10000 పరుగుల క్లబ్‌లో చేరాడు.

తద్వారా సచిన్‌ (18426), విరాట్‌ (13024), గంగూలీ (11363), ద్రవిడ్‌ (10889), ధోని (10773) తర్వాత 10 వేల పరుగుల మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 15వ బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డుల్లోకెక్కాడు. అలాగే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా (241 ఇన్నింగ్స్‌లు), ఈ ఘనత సాధించిన సాధించిన 15 మంది ఆటగాళ్లలో మూడో అత్యుత్తమ సగటు (49.02) కలిగిన బ్యాటర్‌గా పలు ఘనతలను సొంతం చేసుకున్నాడు. 

కాగా, పాక్‌పై భారీ విజయం సాధించిన గంటల వ్యవధిలోనే భారత్‌ మరోసారి బరిలోకి దిగాల్సి వచ్చింది. వర్షం కారణంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడటంతో భారత్‌ వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాక్‌తో ఆడిన జట్టులో భారత్‌ ఓ మార్పు చేసింది.

శార్దూల్‌ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో అక్షర్‌ పటేల్‌కు అవకాశం ఇచ్చింది. బ్యాటర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌.. 9 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. 23 పరుగులతో (2 ఫోర్లు, సిక్స్‌) రోహిత్‌, 18 పరుగులతో (2 ఫోర్లు) గిల్‌ క్రీజ్‌లో ఉన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)