Breaking News

రాజ్‌కోట్‌ టెస్ట్‌: టీమిండియాకు షాక్‌.. అశ్విన్‌ ఔట్‌

Published on Sat, 02/17/2024 - 08:21

ఢిల్లీ: టీమిండియాకు పెద్ద షాక్‌ తగిలింది. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ నుంచి భారత బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వైదొలిగాడు.  వ్యక్తిగత కారణాలతో అశ్విన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించింది. అతని తల్లికి ఆరోగ్యం బాగోలోద ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది.

తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతోనే అశ్విన్‌ మ్యాచ్‌ నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్‌కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్‌ఇండియా జట్టు అందిస్తుందని పేర్కొంది.

ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఒక పోస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో తన తల్లికి దగ్గర ఉండడం కోసం అశ్విన్‌ రాజ్‌కోట్‌ నుంచి చెన్నై వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండోరోజు బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మ్యాచ్‌లో అశ్విన్‌ శుక్రవారం ఒక వికెట్‌ తీసి 500 వికెట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. భారత్‌ టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా ఘనతకెక్కాడు. మూడో టెస్టులో అశ్విన్‌ 37 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.  ఇటువంటి తరుణంలో జట్టుకు అశ్విన్‌ దూరం కావడం పెద్దదెబ్బే.   

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి