Breaking News

Ashes Series 1st Test: స్మిత్‌ భరతం పట్టిన స్టోక్స్‌

Published on Sat, 06/17/2023 - 17:55

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌.. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌, ఇన్‌ ఫామ్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ భరతం పట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న స్మిత్‌ (16)ను స్టోక్స్‌ ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేశాడు. స్టోక్స్‌ సంధించిన అద్భుతమైన ఇన్‌ స్వింగర్‌ను మిస్‌ అయిన స్మిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. స్మిత్‌.. రివ్యూకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎత్తు విషయంలో అనుమానం వ్యక్తం చేసినప్పటికీ.. రీప్లేలో బంతి వికెట్ల టాప్‌ ఎడ్జ్‌ తగులుతుందని తేలింది. దీంతో స్మిత్‌ వెనుదిరగక తప్పలేదు.

స్టోక్స్‌ గర్జిస్తూ సంబరాలు చేసుకున్నాడు. స్టోక్స్‌ మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ బౌలింగ్‌కు దిగి కీలకమైన స్మిత్‌ వికెట్‌ను పడగొట్టాడు. 2019 యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో రెండు సెంచరీలు బాదిన స్మిత్‌.. ఈ మ్యాచ్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌ గడ్డపై స్మిత్‌కు ఉన్న ట్రాక్‌ రికార్డు చూసి ఇంగ్లండ్‌ బౌలర్లు వణిపోయారు. అతను ఇక్కడ ఆడిన గత 9 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు చేశాడు. అయితే స్మిత్‌ తన భీకర ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కొనసాగించలేకపోయాడు. స్టోక్స్‌ వ్యూహంలో చిక్కుకుని ఔటయ్యాడు.

కాగా, స్మిత్‌ ఔటయ్యే సమయానికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసి, కష్టాల్లో పడింది. తొలుత స్టువర్ట్‌ బ్రాడ్‌ వరుస బంతుల్లో వార్నర్‌, లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి (392/8) సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జో రూట్‌ (118 నాటౌట్‌) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించగా.. జాక్‌ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయోన్‌ 4, హాజిల్‌వుడ్‌ 2, బోలండ్‌, గ్రీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

చదవండి: నిప్పులు చెరుగుతున్న బ్రాడ్‌.. వరుస బంతుల్లో వార్నర్‌, లబూషేన్‌ ఔట్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)