Breaking News

బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టాడు

Published on Wed, 08/02/2023 - 19:14

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం. కోపంతో గొడవలు జరిగిన సమయంలో ఆటగాళ్లు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ తనకు తెలియకుండా జరిగిన పొరపాటు వల్ల ప్రత్యర్థి ఆటగాడికి ఎంత నష్టం జరిగిందనేది ఈ వార్త తెలియజేస్తుంది. 

విషయంలోకి వెళితే.. కోపా లిబెర్ట‌డోర్స్ టోర్నీ(Copa Libertadores)లో భాగంగా బ్రెజిల్ ఫ్లుమినెన్స్,అర్జెంటినోస్ జూనియ‌ర్స్‌ తలపడ్డాయి.  మ్యాచ్‌లో ఇరుజ‌ట్లు చెరొక గోల్ కొట్టడంతో మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. కాగా ఆట 56వ నిమిషంలో బ్రెజిల్ ఫ్లుమినెన్స్ ఆట‌గాడు మార్సెలో బంతిని త‌న్న‌బోయి అనుకోకుండా ప్రత్య‌ర్థి డిఫెండ‌ర్ లుసియానో సాంచెజ్ ఎడ‌మ‌ కాలు గ‌ట్టిగా తొక్కాడు. మార్సెలో బంతిని తన్నబోయే సమయంలోనే లుసియానో అతని వైపు దూసుకురావడం.. కాలు అడ్డుపెట్టడం జరిగిపోయాయి. 

దీంతో లుసియానో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయి నొప్పితో విల‌విల‌లాడాడు. ఊహించ‌ని సంఘ‌ట‌న‌తో మార్సెలో షాక్ తిన్నాడు. వెంట‌నే వైద్య సిబ్బంది మైదానంలోకి ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చారు. లూసియానోను ప‌రీక్షించిన వైద్యులు కాలు విరిగిపోయిన‌ట్టు గుర్తించారు. అత‌ను కోలుకునేందుకు 8 నెల‌ల నుంచి 12 నెల‌లు ప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం.

బాధ భ‌రించ‌లేక ఏడుస్తునే మైదానం వీడిన లూసియానోను చూసి మార్సెలో కంటత‌డి పెట్టుకున్నాడు. ''నేను ఈరోజు మైదానంలో నేను చాలా క‌ష్ట‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొన్నా. స‌హ‌చ‌ర ఫుట్‌బాల‌ర్‌ను కావాల‌ని గాయ‌ప‌ర‌చ‌లేదు. లుసియానో సాంచెజ్‌.. నువ్వు తొంద‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా'' అని మార్సెలో ట్విటర్‌లో పేర్కొన్నాడు. మార్సెలో​ పోస్ట్‌పై అర్జెంటీనా క్ల‌బ్ స్పందిస్తూ.. ''మ‌నం ప్ర‌త్య‌ర్థులం.. శ‌త్రువులం కాదు'' అని కామెంట్ చేసింది.

చదవండి: 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్‌

స్లో ఓవర్‌ రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌, ఆసీస్‌లకు షాక్‌; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)