ఫిక్సింగ్‌ ఆరోపణలు.. కప్పు గెలవొద్దనే ఇలాంటి కుట్రలు!

Published on Sat, 07/11/2026 - 12:41

ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రేపు జరగనున్న క్వార్టర్ ఫైనల్లో మెస్సీ సేన స్విట్జర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. స్విట్జర్లాండ్‌పై విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాలని అర్జెంటీనా జట్టు భావిస్తోంది. 

ఈ సంగతి పక్కనబెడితే క్వార్టర్స్‌లో రిఫరీ సానుకూల నిర్ణయాలతో తమను చీట్ చేసి గెలిచిందని ఈజిప్ట్ ఫిఫాకు ఫిర్యాదు చేసింది. ఇది ఫిక్సింగ్ కిందకు వస్తుందని, దీనిపై విచారణ చేపట్టాలని కూడా ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫిఫాను కోరింది. ఈ నేపథ్యంలోనే అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని తమ జట్టుపై వస్తున్న ఆరోపణలపై తొలిసారి స్పందించాడు. 

ఇప్పటిదాకా బయటే వినిపించిన ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు ఆటగాళ్ల దాకా కూడా వచ్చాయని తెలిపాడు. అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ గెలవకూడదనే ఉద్దేశంతోనే కొందరు గిట్టనివాళ్లు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తాము పట్టించుకోమని కుండబద్దలు కొట్టాడు. 

లియోనల్ స్కలోని మాట్లాడుతూ.. ‘అర్జెంటీనా గెలవకూడదని కోరుకోవడం ఇదేమి కొత్త కాదు. 1986 ఫిఫా ప్రపంచకప్‌ సమయంలోనూ అర్జెంటీనాపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కానీ అప్పటి మారడోనా బృందం ఇలాంటి వాటిని బేఖాతరు చేయకుండా ఒక చాంపియన్ ఆటను ప్రదర్శించి రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది. 

ఈజిప్ట్ ఆరోపిస్తున్నట్లుగా రెండో అర్ధభాగంలో వాళ్లు కొట్టిన గోల్‌ను రద్దు చేయడానికి ముందే వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్‌) ఫుటేజీని క్లియర్‌గా పరిశీలించారు. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే నిర్దేశించిన నియమాలను మాత్రమే వీఏఆర్ బృందం పాటిస్తోందని' లియోనల్ స్కలోని పేర్కొన్నాడు. 

ఇక ఫిఫా 2026లో అర్జెంటీనా చాంపియన్ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు.

చదవండి: కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు!

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)