కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ క‌వ‌ర్‌లో ఏముంది?

Published on Mon, 06/01/2026 - 20:00

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ చాంపియ‌న్‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో గుజ‌రాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కోహ్లీ(75 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించ‌డ‌మే గాక రెండోసారి టైటిల్ అందించాడు.

అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌ల మ‌ధ్య జ‌రిగిన ఒక స‌న్నివేశం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఆ వీడియోలో అనుష్క‌, కోహ్లీ న‌డుచుకుంటూ వెళుతున్న స‌మ‌యంలో, అనుష్క చేతిలో ఒక క‌వ‌ర్ క‌నిపించింది. ఇది చూసిన కోహ్లీ అందులో ఏముందో తెలుసుకోవ‌డానికి అది ఒక‌సారి ఇవ్వాల‌ని అడిగాడు. 

కానీ అనుష్క మాత్రం కోహ్లీకి లెటర్ ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.అయినా కోహ్లీ అదే ప‌నిగా ఆమె చేతి నుంచి లెట‌ర్ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనుష్క శ‌ర్మ డ‌గౌట్‌కు చేరుకున్న త‌ర్వాత ఇస్తానులే అని చెప్పింది. దీంతో కోహ్లీ ఏంటి ఇలా చేస్తున్నావ‌న‌డం వీడియోలో క‌నిపించింది. ఇది చూసిన అభిమానులు ఇంత‌కీ ఆ క‌వ‌ర్‌లో ఏముంది చెప్మా అంటూ కామెంట్లు పెట్టారు.

మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు.  ఆర్సీబీ బౌల‌ర్ల‌లో ర‌సిక్ స‌లామ్ 3 వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్‌, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించ‌గా, వెంక‌టేశ్ అయ్య‌ర్ (32), టిమ్ డేవిడ్ (24) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ రెండు వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, ర‌బాడ‌లు చెరొక వికెట్ తీశారు.

చదవండి: కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్‌.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం!

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)